AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea: మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపితే ఏం జరుగుతుంది..?

భారతదేశంలో చాలా మంది ప్రజలు ఉదయం తీసుకునే పానీయం టీ. కొంతమంది పాలతో చేసిన టీ తాగితే... మరికొందరు గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, అల్లం టీతో తమ రోజును ప్రారంభిస్తారు. అయితే, ఈ టీలో ఉప్పు కలపడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి..?

Tea: మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపితే ఏం జరుగుతుంది..?
Tea
Ram Naramaneni
|

Updated on: May 04, 2024 | 6:29 PM

Share

చాలా మందికి, టీ అనేది ఓ ఎమోషన్. ఉదయం లేవగానే ఓ టీ తాగడంతో రోజు ప్రారంభించే వారు బోలెడు మంది ఉంటారు. ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్తే ఫస్ట్ టీ ఆఫర్ చేస్తారు. ఇక చిరాగ్గా ఉన్నా, ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కొట్టాలన్నా టీ పక్కగా ఉండాల్సిందే. అలా.. తెలుగు లోగిళ్లలో టీ విడదీయరాని భాగం అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పానీయం టీ. అయితే, మీ టీలో చిటికెడు ఉప్పు కలపడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ?.. అవేంటో తెలుసుకుందాం పదండి.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

మొత్తం శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరాన్ని కాలానుగుణంగా వచ్చే గొంతు ఇన్ఫెక్షన్ నుండి నివారిస్తుంది.

సానుకూల జీర్ణ వ్యవస్థ:

ఉప్పు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మానవ శరీర  జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.

బాడీ హైడ్రేషన్‌ను కాపాడుతుంది:

ఉప్పు అనేది సహజమైన ఎలక్ట్రోలైట్. ఇది వేసవిలో మన బాడీ హైడ్రేటెడ్‌గా ఉండటానికి సాయపడుంది

ఎన్నో ఖనిజాలు:

ఉప్పులో మెగ్నీషియం, సోడియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. మన మొత్తం ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:

సాల్టెడ్ టీ తాగడం వల్ల శరీరానికి జింక్ చేరుతుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది, మొటిమలను నివారిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మైగ్రేన్‌ను పోగొడుతుంది:

టీలో ఉప్పు కలపడం వల్ల మీ మైగ్రేన్ సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. అలానే మీ మనస్సును రిలాక్స్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. మెరుగైన శరీర పనితీరును ప్రోత్సహిస్తుంది.

చేదును తగ్గిస్తుంది:

మీరు టీని ఎక్కువగా బాయిల్ చూస్తే.. చేదు తగులుతుంది. ఆ చేదు రుచిని నివారించడానికి మీరు 1 చిటికెడు ఉప్పును యాడ్ చేస్తే సరిపోతుంది

రుచిని మెరుగుపరుస్తుంది:

ఉప్పు గ్రీన్ , వైట్ టీ వంటి టీ రకాల తీపిని పెంచుతుంది. ఇది అదనపు చక్కెర అవసరాన్ని నిరాకరిస్తుంది.

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. ఫాలో అయ్యేముందు వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..