మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..

నిత్యం తినే ఆహార పదార్థాల్లో ఏవి కల్తీవో, ఏవి అసలైనవో తెలుసుకోవడం చాలా కష్టం. వాటి ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగా చూపుతుంది. అందులోనూ నేటి సమాజంలో పాల ఉత్పత్తులు, పాల పదార్థాల్లో చాలా వరకు నకిలీవి రాజ్యమేలుతున్నాయి. అందులో పన్నీర్ తొలి స్థానంలో ఉంది. పన్నీర్ అంటే తెలియని వారు ఉండరు. రోటీలోకి నంచుకునే పన్నీర్ బట్టర్ మసాలా మొదలు కబాబ్స్ లో తినే పన్నీర్ తిక్కా వరకు అందరూ చూడటమే కాదు అందులో చాలా మంది రుచి చూసి ఉంటారు. ప్రస్తుతం దోశలో కూడా పన్నీర్ బటర్ మసాలా దోశ అంటూ కొత్త రుచిని అందిస్తున్నాయి కొన్ని హూటల్స్.

|

Updated on: May 04, 2024 | 8:52 PM

నిత్యం తినే ఆహార పదార్థాల్లో ఏవి కల్తీవో, ఏవి అసలైనవో తెలుసుకోవడం చాలా కష్టం. వాటి ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగా చూపుతుంది. అందులోనూ నేటి సమాజంలో పాల ఉత్పత్తులు, పాల పదార్థాల్లో చాలా వరకు నకిలీవి రాజ్యమేలుతున్నాయి. అందులో పన్నీర్ తొలి స్థానంలో ఉంది.

1 / 6
పన్నీర్ అంటే తెలియని వారు ఉండరు. రోటీలోకి నంచుకునే పన్నీర్ బట్టర్ మసాలా మొదలు కబాబ్స్ లో తినే పన్నీర్ తిక్కా వరకు అందరూ చూడటమే కాదు అందులో చాలా మంది రుచి చూసి ఉంటారు. ప్రస్తుతం దోశలో కూడా పన్నీర్ బటర్ మసాలా దోశ అంటూ కొత్త రుచిని అందిస్తున్నాయి కొన్ని హూటల్స్.

2 / 6
అయితే ఈ పన్నీర్ మంచిదేనా, కల్తీదా అనేది కనుక్కోవడం చాలా పెద్ద పరిశ్రమే అని భావిస్తుంటారు చాలా మంది. అయితే మీరు వాడే పన్నీర్ అసలీనా, నకిలీనా ఇట్టే తేల్చేయొచ్చు. కేవలం మూడు చిట్కాలు ఫాలో అయితే మన ఇంట్లోనే దాని బండారం బయటపెట్టొచ్చు

3 / 6
నిజమైన పన్నీర్, డూప్లికేట్ పన్నీర్ కు మధ్య ఉంటే వ్యత్యాసం ఏంటంటే ఒరిజినల్ పన్నీర్ వాసన చూస్తే చాలా మంచి పాల వాసన వస్తుంది. కొద్దిగా తుంచి రుచి చూస్తే పాల రుచి కనిపిస్తుంది. డూప్లికేట్ అయితే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. దీంతో పాటు పనీర్‌ కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్‌ వేయాలి. పనీర్‌ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్‌ అయితే రంగు మారదు.

4 / 6
పన్నీర్‌ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్‌ కల్తీ అని అర్థం. రంగు మారకపోతే నిర్భయంగా ఆ పనీర్‌ను వాడుకోవచ్చు.

5 / 6
అలాగే పాలతో చేసిన పనీర్‌ అయినప్పటికీ పుల్లటి వాసన వస్తుంటే, లేదా రుచిలో ఏదైనా తేడా కొడితే వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు. ఎంత మంచి కంపెనీలు అయినా వాటి డొల్ల తనాన్ని అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటాయి.  అది సహజమైనదే అయినా తాజాగా లేదని అర్థం. వాటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్లమవుతాము.

6 / 6
Follow us