Fermented Rice: ఆహా చద్దన్నం – ఓహో చద్దన్నం – ప్రయోజనాలు అనేకం..
చద్దన్నం తింటే చలవ చేస్తుండి. కడుపు తేలికగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది.. ఈ విషయాలు మీ ఇంట్లో వయసుమళ్లినవారికి ఎవర్ని అడిగినా చెబుతారు. మన పూర్వీకులు ఉదయాన్నే టిఫిన్ మాదిరిగా దీన్ని తిని.. ఉత్సాహంగా రోజువారీ పనులు చేసుకునేవారు. చద్దన్నం ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం...

ఇప్పుడు కాదు కానీ.. ఒక 25 సంవత్సరాల క్రితం ఉదయాన్నే టిఫిన్‌గా మన పూర్వికులు ఏం తీసుకునేవారో తెల్సా.. చద్దన్నం… అవును ముఖ్యంగా పల్లెటూర్లలో ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు వేసుకుని.. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ లేదా ఏదైనా పచ్చడి నంజు పెట్టుకుని తినేవారు. ఆ సమయంలో పొద్దున్నే పనులకు వెళ్లేముందు టైం లేక.. రాత్రి అన్నం వేస్ట్ చేసే ఉద్దేశం లేక అలా చేసేవారు కానీ.. అది అమృతంతో సమానం అని ఆ తర్వాత కాలంలో తెలిసింది. కాగా పల్లెటూర్లలో కొందరు ఇప్పటికీ చద్దన్నమే తింటున్నారు. దాని ఉపయోగాలు తెలిసిన తర్వాతే ఇప్పటి జనరేషన్ వాళ్లు సైతం చద్దన్నం వైపు మళ్లుతున్నారు. చద్దన్నం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం
1. నేచురల్ ప్రోబయాటిక్: చద్దన్నం పులిసినప్పుడు అందులో లాక్టోబాసిల్లస్ అనే హెల్తీ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పులిసిన అన్నం తీసుకోవడం ద్వారా ఫుడ్ ఈజీగా జీర్ణమవుతుంది.
2. శరీరానికి చల్లదనం: చద్దన్నం మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఎండాకాలంలో చద్దన్నం తింటే.. బాడీ ఎక్కవ డీహైడ్రేట్ అవ్వదు.
3. ఎన్నో పోషక విలువలు: చద్దన్నం పులియడం వల్ల అన్నంలో ఉన్న పోషకాలు శరీరానికి ఈజీగా అందుతాయి. మన ఆరోగ్యానికి ఎంతో అవసరం అయిన విటమిన్ బి12 లాంటి ముఖ్యమైన పోషకాలు దీని ద్వారా అధికంగా లభిస్తాయి. ఇవి ఎనర్జీ ప్రొడక్షన్ కోసం.. నాడీ వ్యవస్థ యాక్టివ్‌గా పని చేసేందుకు ఉపయోగపడతాయి.
4. కోలెస్ట్రాల్ నియంత్రణ: చద్దన్నం తీసుకోవడం ద్వారా రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గిపోతాయి. సో.. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. రోగనిరోధక శక్తి పెంపు: చద్దన్నంలోని తేలికపాటి యాసిడిటీ, సహజ ఫెర్మెంటేషన్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వివిధ రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
7. డయాబెటిస్ ఉన్న వారికి ఉపయోగం: చద్దన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా భయపడకుండా తినవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది.
చద్దన్నం తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. మన పూర్వీకుల నుంచి వచ్చిన సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్. దీన్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..