AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఇదొక్కడి తీసుకోండి చాలు

ప్రస్తుతం అందరి జీవితాల్లో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పూర్వీకులు తీసుకున్న ఆహారంతో పోలిస్తే ఇప్పుడు మనం తినే ఆహారానికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఉద్యోగ రిత్యా ఎక్కవ సమయం కూర్చొని పనిచేస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు. పోషకాహారం కాకుండా ఎక్కవగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా మరో కారణం. ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది.

Health Benefits: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఇదొక్కడి తీసుకోండి చాలు
Ragi Java
Aravind B
|

Updated on: Aug 16, 2023 | 5:22 AM

Share

ప్రస్తుతం అందరి జీవితాల్లో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పూర్వీకులు తీసుకున్న ఆహారంతో పోలిస్తే ఇప్పుడు మనం తినే ఆహారానికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఉద్యోగ రిత్యా ఎక్కవ సమయం కూర్చొని పనిచేస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు. పోషకాహారం కాకుండా ఎక్కవగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా మరో కారణం. ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. ఇందుకే చాలామంది వీటిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే సరైన ఆహారం శరీరానికి అందకపోవడం వల్ల పోషకాలు లోపిస్తాయి. దీనివల్ల ఎముకలకు సంబధించిన సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందకోసం కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యను జయించవచ్చు. మరో విషయం ఏంటంటే దీనికి ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.

ఇక ఆ చిట్కాలను గనుక పరిశీలిస్తే.. ప్రతిరోజూ ఉదయమే రాగీజావ తీసుకోవడం చాలామంచింది. ఇది తాగడం వల్ల ఎముకల సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు ఎముకలు కూడా బలంగా మారుతాయి. అందుకోసమే రాగిజావ తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అలాగే ఇది ఓ మంచి అల్పాహారం కూడా. అంతేకాదు వీటిలో పాలు కలిపి తీసుకుంటే మరింత పోషకంగా మారుతుంది. కాల్షియానికి మూలం పాలు. ముఖ్యంగా ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో దీని పాత్ర ఎంతో కీలకమైనది. అంతేకాదు అధికంగా బరువు ఉంటే తగ్గించుకోవడానికి కూడా ఈ రాగిజావ తోడ్పడుతుంది. అంతేకాదు ముఖ్యంగా బాలింతలు కూడా ఈ రాగిజావ తాగడం ఎంతో మంచింది. ఎందుకంటే బాలింతలు కూడా ఈ రాగిజావ తాగితే వారి చనుబాలును పెంచుతుంది. చనుబాలు సరిగ్గా రాక ఇబ్బందులు పడే బాలింతలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

రాగిజావ తయారు చేసే విధానం రాగి పిండి- 2 టేబుల్ స్పున్లు, 250 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. అలాగే బెల్లం – రెండు టీ స్పూన్లు, యాలకుల పొడి అవసరం మేరకు తీసుకోవాలి. ముందుగా పాలు తీసుకొని స్టవ్‌పై వేడిచేయాలి. అది వేడి అయ్యాక అందులో రాగిపిండి వేయాలి. అలాగే ఆ పిండి ముద్దలు కాకుండా ఉండేందుకు తరచుగా కలుపుతూ ఉండాలి. ఇంకా అవసరమైతే కొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. పిండి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో బెల్లం వేయాలి. ఆ తర్వాత దాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేయాలి. ఇలా చేస్తే రాగిజావ తయారైనట్లై. అయితే దీన్ని అలా వేడివేడిగానే తాగకూడదు. కొద్దిగా చల్లబరిచాక తీసుకోవాలి. ఇలా రాగిజావ ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది తాగితే అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..