Watch Video: జై జవాన్.. భారత్ – చైనా సరిహద్దులో సామాన్యులు చూడని యుద్ధభూమి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
Independence Day 2023 Special: దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్ల దొరల బానిసత్వం నుంచి భరత మాత విముక్తి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను యావత్ జాతి గుర్తుచేసుకుంది. అదే సమయంలో దేశ సరిహద్దుల్లో మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు యావత్ దేశం సెల్యూట్ చేసింది.
Independence Day: 77వ స్వాతంత్ర దినోత్సవ వేళ యావత్ భారతావని దేశ భక్తితో ఉప్పొంగిపోయింది. దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్ల దొరల బానిసత్వం నుంచి భరత మాత విముక్తి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను యావత్ జాతి గుర్తుచేసుకుంది. అదే సమయంలో దేశ సరిహద్దుల్లో మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు యావత్ దేశం సెల్యూట్ చేసింది. జై జవాన్ అంటూ నినదించింది.
అదే సమయంలో దేశ సరిహద్దుల్లో రక్షణగా నిలుస్తున్న భారత సైనికుల సేవలను ప్రజల కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది టీవీ9 నెట్‌వర్క్. భారత్- చైనా సరిహద్దులోని లద్ధఖ్‌లో పర్యటించిన టీవీ9 ప్రతినిధి.. సామాన్యులు ఇప్పటి వరకు చూడని యుద్ధభూమిని కళ్లకు కట్టారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos