Pregnancy Diet: గర్భిణీ స్త్రీ ఈ పండ్లు తింటున్నారా? అయితే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..

Pregnancy Diet: ప్రతి స్త్రీకి తల్లిగా మారే క్షణం తన జీవితంలోనే అత్యంత అందమైన అనుభూతిని పొందుతుంది. గర్భవతి అని తెలియగానే సంబరపడిపోతుంటా

Pregnancy Diet: గర్భిణీ స్త్రీ ఈ పండ్లు తింటున్నారా? అయితే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..
Healthy Food
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 15, 2022 | 8:47 AM

Pregnancy Diet: ప్రతి స్త్రీకి తల్లిగా మారే క్షణం తన జీవితంలోనే అత్యంత అందమైన అనుభూతిని పొందుతుంది. గర్భవతి అని తెలియగానే సంబరపడిపోతుంటారు ఆ దంపతులు. అయితే, గర్భం దాల్చిన 9 నెలల ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భధారణ సమయంలో, మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో తాజా పండ్లను తినడం చాలా ముఖ్యం. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. తాజా పండ్లలో అనేక విటమిన్లు, పోషకాలు ఉంటాయి. పండ్లు తినడం ద్వారా గర్బిణీ స్త్రీలలో స్వీట్స్ తినాలనే కోరికలను అదుపు చేస్తాయి. అదే సమయంలో శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పండ్లు తినాలనేదానిపై నిపుణులు పలు పండ్లను సిఫారసు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కివి.. గర్భధారణ సమయంలో ఈ పండు తినడం వలన ప్రయోజనం కలుగుతుంది. ఇందులో విటమిన్లు సి, ఇ, ఎ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఈ పండు తినడం వల్ల దగ్గు, నరాల సమస్య తొలగిపోతుంది.

చికూ.. గర్భధారణ సమయంలో కళ్లు తిరిగడం, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి. వీటిని నివారించడంలో చికూ సహాయపడుతుంది. ఈ పండు విరేచనాలు, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

నేరేడు పండు.. నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తహీనత నుండి రక్షించడానికి పనిచేస్తుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆపిల్.. యాపిల్ గర్భధారణ సమయంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఆపిల్ పిల్లలను అలర్జీ నుండి కాపాడుతుంది.

నారింజ పండ్లు.. విటమిన్ సి, ఫోలేట్, నీరు సమృద్ధిగా ఉండటం వల్ల నారింజ ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.

మామిడి.. 1 కప్పు తరిగిన మామిడికాయలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది విటమిన్ సి రోజువారీ అవసరాన్ని తీరుస్తుంది. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పియర్.. పీచు, ఫోలేట్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. గర్భధారణ సమయంలో వీటిని తినడం వలన మలబద్ధకం ఏర్పడదు. ఇది పిల్లల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

దానిమ్మ.. దానిమ్మలో విటమిన్లు, క్యాల్షియం, ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా మారడంలో సహాయపడుతుంది.

అవకాడో.. విటమిన్ బి, కాపర్, ఫైబర్ సమృద్ధిగా ఉండే అవకాడో శిశువు చర్మానికి, మెదడుకు మేలు చేస్తుంది. ఇది గర్భిణీ స్త్రీల కాళ్లలో వచ్చే తిమ్మిరి సమస్యను దూరం చేస్తుంది.

Also read:

Sandhya Raju: ఆకట్టుకుంటున్న నాట్యం హీరోయిన్ ఫినామిల్ ఉమెన్ వీడియో.. ప్రశంసలు కురిపించిన ఎఆర్ రెహమాన్..

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

DSCR: ఏదైనా కంపెనీ బలం తెలుసుకోవాలంటే.. ఈ రేషియోను తప్పక చూడండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!