Corona Virus: దీర్ఘకాల కోవిడ్ లక్షణాలను లైట్ తీసుకుంటున్నారా.? అజాగ్రత్తతో ప్రాణాలకే ప్రమాదం..
Corona Virus: కంటికి కనిపించని ఓ వైరస్ (Corona) యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఆర్థికంగా, ఆరోగ్యంగా మనుషులపై తీవ్ర ప్రభావం చూపింది. మాయదారి కరోనా కారణంగా మానవ పురోగతి...
Corona Virus: కంటికి కనిపించని ఓ వైరస్ (Corona) యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఆర్థికంగా, ఆరోగ్యంగా మనుషులపై తీవ్ర ప్రభావం చూపింది. మాయదారి కరోనా కారణంగా మానవ పురోగతి వెనక్కి నేట్టేసినట్లైంది. భూమిపై దాదాపు అన్ని చోట్ల కరోనా ప్రభావం పడింది. వేవ్ వేవ్‌కు రూపం మార్చుకుంటూ దండెత్తడానికి వస్తోంది. కొన్ని రోజుల పాటు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా భయాలు మొదలయ్యాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న వారికి ఇప్పటికీ అడపాదడపా లక్షణాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటినే నిపుణులు దీర్ఘకాల కోవిడ్ లక్షణాలుగా అభివర్ణిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న కొంత కాలం తర్వాత ఈ లక్షణాలు కనిస్తున్నాయి. ముఖ్యంగా ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది, మత్తుగా ఉండడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వృద్ధులు, స్థూలకాయం ఉన్న వాళ్లు, మహిళలు ఎక్కువగా ఈ లాంగ్ కోవిడ్ లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు తెలిపారు. అయితే ఈ లాంగ్ కోవిడ్ లక్షణాలను విస్మరిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలపై నోయిడాకు చెందిన మెట్రో హాస్పిటల్ డాక్టర్ దీపక్ తల్వార్ ప్రత్యేకంగా టీవీ9తో కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇంతకీ తల్వార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘కరోనా నుంచి కోలుకున్న వారిలో పోస్ట్ కోవిడ్ లక్షణాలు భారీగా బయటపడుతున్నాయి. మా అవుట్ పెషేంట్ డిపార్ట్‌మెంట్‌కు వస్తున్న వారిలో 50 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత క్షయ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నారు. వీరిలో 20 శాతం మందికి చికిత్స అందించడం ఇబ్బందిగా మారుతోంది. దీనికి కారణం వీరు పోస్ట్ కోవిడ్ లక్షణాలను విస్మరించడమే. కొన్నిసార్లు పోస్ట్ కోవిడ్ లక్షణాలు ప్రాణాంతకం కావొచ్చు. దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో 88 శాతం పోస్ట్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతుండొచ్చని గతేడాది లంగ్ ఇండియా జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. పోస్ట్ కోవిడ్ లక్షణాలను విస్మరించిన 30 శాతం కేసులు తీవ్ర ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది’ అని దీపక్ తల్వార్ హెచ్చరించారు.
కోవిడ్ -19 మునపటి వేరియంట్‌లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువ ప్రమాదం ఉంది. వీరు రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వారికి భవిష్యత్తులో రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది, కాబట్టి లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయని వేచి చూడకుండా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. కోవిడ్-19 ప్రభావం కేవలం రోగి ఊపిరితిత్తులపైనే కాకుండా అసాధరణంగా శరీరంలో రక్తం గడ్డ కట్టడం, గుండె, మెదడు, కండరాల సమస్యలు, వాంతులు, అతిసారం, జీర్ణక్రియ వంటి వాటిపై ప్రతికూలం ప్రభావం చూపించే ప్రమాదం ఉంది అని తల్వార్ చెప్పుకొచ్చారు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్నాం ఇక మాకేంటి అనే అలసత్వం ప్రదర్శించకుండా నిత్యం సరైన ఆహారం, వ్యాయామం, యోగా వంటివి చేస్తూ ఉంటే పోస్ట్ కోవిడ్ లక్షణాలను ధీటుగా ఎదుర్కోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..