Pregnancy: ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ రోజువారీ అలవాట్లకు దూరంగా ఉండండి.!!
ఈ రోజుల్లో గర్భం అనేది చాలా క్లిష్టంగా మారింది. పిల్లలను కనేందుకు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. అంతేకాదు రోజువారీ అలవాట్లు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా సమస్యగా మారుతున్నాయి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే దంపతులు కొన్నిరోజువారీ అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భం దాల్చడం అనేది నేటి కాలంలో చాలా పెద్ద సమస్యగా మారింది. ఎంత ప్రయత్నించినా…ప్రెగ్నెన్సీ రావడంలేదని చాలామంది ఆందోళన చెందుతుంటారు. గర్భధారణ ఏ నెలలో సానుకూలంగా ఉంటుందో తెలియదు కాబట్టి…పిల్లలను కనాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండాలి. మన జీవనశైలి అలవాట్లతో సహా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. మీ రోజువారీ అలవాట్లను తగ్గించి..గర్భం దాల్చేందుకు ప్రయత్నించండి.
1. ధూమపానానికి దూరంగా ఉండాలి:
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిందే. పొగాకు శరీరభాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అండాలు, స్పెర్మ్ లోని జన్యు పదార్థాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ధూమపానం వల్ల సంతానలేమి సమస్యలు ఏర్పడతాయి. పురుషులలో అంగస్తంభన, స్పెర్మ్ కౌంట్ లో తేడా ఉంటుంది. వంధ్యత్వదం ఎక్టోపిక్ గర్భం, అకాల పుట్టుక, వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి గర్భం దాల్చాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ధూమపానానికి దూరంగా ఉండాలి.
2. ఆల్కాహాల్ జోలికి వెళ్లకూడదు:
ఆల్కాహాల్ అండోత్సర్గము రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు గర్భానికి ప్లాన్ చేస్తున్నట్లయితే మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండండి. గర్బధారణ సమయంలో మద్యం అతిగా సేవించినట్లయితే మీ ఆరోగ్యంపై చాలా ప్రమాదం చూపుతుంది. కడుపులో పెరిగే పిండంపై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది.




3. కెఫీన్‌కు దూరంగా:
ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే దంపతులు కెఫిన్ కు దూరంగా ఉండాలి. ప్రతిరోజు 200 మిల్లీగ్రాముల కంటే తక్కువ కెఫిన్ తీసుకోవచ్చు. కానీ రోజుకు రెండు మూడు కప్పుల కాఫీ తాగడం తాగే అలవాటును మానుకోవాలి. ధూమపానం, మద్యపానంతోపాటు కెఫిన్ కూడా ప్రెగ్నెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతుంది
4. అతిగా వ్యాయామం చేయకూడదు:
అతిగా వ్యాయామం చేస్తే దాని ప్రభావం శరీరంపై చూపుతుంది. శారీరక శ్రమ అండోత్సర్గాన్ని నిరోధిస్తుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మీరు గర్భంకోసం ప్లాన్ చేసుకుంటే అతిగా వ్యాయామం చేసే అలవాటును మానుకోండి. శారీరక శ్రమ వారానికి ఐదుగంటల కంటే తక్కువగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
5. టాక్సిన్స్ ఎఫెక్ట్ ఉండకూడదు:
నేటికాలంలో పర్యావరణకాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గర్భాదారణకు ప్లాన్ చేసుకునే దంపతులు పురుగుల మందులు, డ్రైక్లినింగ్ ద్రావకాలు, సీసం వంటి సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ప్రతికూల అంశాలకు దూరంగా ఉండటం మంచిది.
6. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి:
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సినంత నిద్ర అవసరం. నిద్రలేమి కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కొంతమంది రాత్రిళ్లు అస్సలు నిద్రపోరు. మొబైల్స్, ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని గడుపుతుంటారు. ఈ అలవాటును మానుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీకోసం ప్రయత్నిస్తున్న జంటలు సమయానికి ఆహారం, కావాల్సినంత నిద్ర ఉండేలా చూసుకోవడం మంచిది.
మన లైఫ్ స్టైల్ మార్చుకోవడంలో కాస్త ఇబ్బంది కలిగిన..కాలక్రమేణా అది అలవాటుగా మారతుంది. పైన పేర్కొన్న రోజువారీ అలవాట్లతోపాటు చిన్నచిన్న మార్పులు చేసుకున్నట్లయితే సంతోషకరమైన గర్భాన్ని దాల్చవచ్చు. అనవసర ఆందోళనలు, ఆసుపత్రుల చుట్టు తిరగడం ఇవన్నీ పక్కన పెట్టి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి. మీరు వేసే ప్రతి అడుగు మీ ఆరోగ్యంతోపాటు మీకు పుట్టబోయే బిడ్డపై ప్రభావాన్ని చూపుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



