AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Heart: గుండె ఆరోగ్యానికి ఈ ఆయుర్వేద మూలికలు సంజీవని..! అవేంటో తెలుసుకోండి..

మనదేశంలో ప్రస్తుతం గుండె జబ్బులున్నవారి సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి సోకకుండా అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.

Healthy Heart: గుండె ఆరోగ్యానికి ఈ ఆయుర్వేద మూలికలు సంజీవని..! అవేంటో తెలుసుకోండి..
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా అనేక జబ్బులకు కారణం సరిగా నిద్రలేకపోవడం, నిద్రలేమి సమస్య అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో సరైన జీవనశైలి లేని కారణంగా చాలా మందికి నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అయితే, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిపిన అధ్యయనంలో కూడా ఇదే కనుగొన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 10, 2023 | 2:59 PM

Share

మనదేశంలో ప్రస్తుతం గుండె జబ్బులున్నవారి సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి సోకకుండా అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం ఇవన్నీ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మధుమేహం, అధికరక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, దంత…ఇలాంటివన్నీ కూడా గుండెజబ్బులకు దారితీస్తాయి. చిన్ని గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. గుండె వ్యాధులు రావడం,వాటి కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఆయుర్వేద మూలికలతో కూడా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆయుర్వేద నివారణలు అవలంబించాలో తెలుసుకుందాం.

గుండెజబ్బులను నివారించే ఆయుర్వేద మూలికలు:

పుదీనా, తులసి ఆకులు:

ఆయుర్వేదం ప్రకారం పుదీనా, తులసిలో ఆరోగ్యా ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కేవలం పవిత్రమై మొక్కమాత్రమే కాదు ఆరోగ్యప్రయదాయిని కూడా. ముఖ్యంగా గుండెసంబంధిత వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయాన్నే తులసితోపాటు పుదీన ఆకులను తినడం అలవాటు చేసుకోండి. తులసి, పుదీనాలో ఉండే అడాప్టోజెనిక్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. తులసీ, పుదీనాను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

రావి ఆకులు:

ఆరోగ్యానికి మేలు కలిగించే ఔషధ గుణాలు మన చుట్టూ లభించే చెట్లలో చాలా వరకు ఉన్నాయి. ఇందులో రావి చెట్టు ముఖ్యమైంది. రావి చెట్టు ఆకులు చాలా రకాల రోగాలను నయం చేస్తాయి. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చెట్టు ఆకులతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఆయుర్వేద నిపుణులను అడిగి పూర్తి సమాచారం తెలుసుకోండి.

పసుపు:

పసుపులో ఉండే ఔషదగుణాలు ఎన్నో వ్యాధులను తగ్గిస్తాయి. పసుపు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందుకే కోవిడ్ కాలంలో పసుపు పాలు, పసుపు నీటిని తీసుకోమని ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గుండెపోటును నివారించడంలో పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపును నీళ్లతో కలుపుతూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. నాలుగు రోజులపాటు ఆరబెట్టాలి. ఈ ముద్దలు బాగా ఆరిన తర్వాత మెత్తగా పొడిచేసుకుని గోరువెచ్చని నీటలో కలుపుకుని ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మూసుకుపోకిన రక్తనాళాలు తెరచుకుంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా