Prostate Cancer: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు ఈ క్యాన్సర్ ఉన్నట్లే.. మగాళ్లు ప్లీజ్ అలెర్ట్
ప్రస్తుత కాలంలో చాలా మంది మగవాళ్లు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రోస్టెట్ అంటే మగవారిలో ఉండే వాల్‌నట్ ఆకారపు గ్రంధి. ఈ గ్రంధి పునురుత్పత్తి విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది.

మన శరీరంలో కనిపించే చిన్నపాటి లక్షణాలు పెద్దగా పట్టించుకోకుండా రోజువారీ పనిలో నిమగ్నమవుతుంటాం. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణం మీదకి తెచ్చుకుంటాం. ముఖ్యంగా పురుషులు ఆరోగ్యం విషయంలో ఎక్కువగా అశ్రద్ధ వహిస్తారు. చిన్నపాటి లక్షణాలను పట్టించుకోకపోతే ఏకంగా క్యాన్సర్ బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది మగవాళ్లు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రోస్టెట్ అంటే మగవారిలో ఉండే వాల్‌నట్ ఆకారపు గ్రంధి. ఈ గ్రంధి పునురుత్పత్తి విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రోస్టెట్ గ్రంధి పనితీరుపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభం కానీ, చివరలో గుర్తిస్తే మాత్రం వైద్యం చేయడం కష్టతరమై ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రారంభ దశలో పురుష నాళం, ఎముకలు, ముత్రాశయం పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఆ క్యాన్సర్ మరింత పెరిగితే మాత్రం కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ప్రోస్టెట్ క్యాన్సర్ లక్షణాలు ఇవే..
మూత్ర సమస్యలు
క్యాన్సర్ పరిమాణం పెరిగేకొద్దీ అది మూత్రనాళం చుట్టూ ప్రభావం చూపిస్తుంది. అలాగే మూత్రవిసర్జనలో చేసే సమయంలో తక్కువ ప్రవాహం లేదా తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. మూత్రంలో రక్తం లేదా వీర్యం రావడం వంటి సమస్యలకు కారణమవుతుంది.
ఎముక సమస్యలు
క్యాన్సర్ మరెక్కడా వ్యాప్తి చెందకపోతే సంక్రమణ తర్వాత ఎముకలు వద్ద ప్రారంభమవుతుంది. దీని వల్ల ఎముకలు పెలుసుగా మారతాయి. దీంతో అవి త్వరగా విరిగిపోతాయి. తుంటి, వీపు వెనుక ప్రాంతంలో కత్తితో పొడిచినట్లుగా ఉంటుంది.
శ్వాస సమస్యలు
ఇది ప్రోస్టెట్ క్యాన్సర్ నాలుగో దశ. ప్రోస్టేట్ క్యాన్సర్ శోషరస గ్రంధులు, ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెడుతుంది. అలాగే పేరుకుపోయిన ద్రవం కారణంగా ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు మరింతగా పెరిగితే రోగులకు రక్తంతో కూడిన దగ్గు వచ్చి, చివరకు ఊపిరితిత్తుల సమస్యలకు కారణం అవుతుంది.
బరువు తగ్గడం
తక్కువ తినకపోయినా అధికంగా బరువు తగ్గితే మాత్రం ప్రోస్టెట్ క్యాన్సర్ లక్షణం కింద అనుమానించాలి. కణితి అధునాతన దశకు చేరుకున్నప్పుడు ఆకలి లేకపోవడం, బలహీనత, బరువు తగ్గడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.
పేగు కదలికల్లో సమస్యలు
క్యాన్సర్ పురుష నాళానికి వ్యాపించినప్పుడు రోగులు వారి పేగు కదిలికల్లో నియంత్రణను కోల్పోతారు. తీవ్రమైన కడుపు నొప్పి, మలవిసర్జన సమయంలో రక్తస్రావం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






