Wrinkled Tongue: శరీరంలో ఈ విటమిన్స్ లోపిస్తే మీ నాలుక చెప్పేస్తుంది…!! మీకూ ఈ సమస్య ఉందేమో చెక్ చేసుకోండి..
బి-కాంప్లెక్స్ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. వీటి లోపం కారణంగా శరీరంలోని అవయవాల పనితీరు దెబ్బతింటుంది. విటమిన్ బి శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన విటమిన్ లలో ఇది ఒకటి.

బి-కాంప్లెక్స్ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. వీటి లోపం కారణంగా శరీరంలోని అవయవాల పనితీరు దెబ్బతింటుంది. విటమిన్ బి శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన విటమిన్ లలో ఇది ఒకటి. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఈ విటమిన్ కాలేయం, గుండె, కిడ్నీ, బ్రెయిన్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. విటమిన్ లోపం వల్ల అనేక అరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మన రూపాన్ని బట్టి మన శరరీరంలో విటమిన్లు, ఖనిజాలు తగ్గాయని గుర్తించవచ్చు. అందులో ఒకటి స్క్రోటల్ నాలుక.. అంటే ముడతలు పడిన నాలుక. ఈ విటమిన్ లోపించినట్లయితే నాలుక, నోటిమూలలు పగులుతాయి. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్లలో నీళ్లు కారటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
స్క్రోటల్ నాలుక అంటే ఏమిటి:
నాలుకపై ముడతలు, లోతైన పగుళ్లు, చారలు ఏర్పడతాయి. చిన్న చిన్న పుండ్లు వస్తాయి. ఇవన్నీ కూడా విటమిన్ బి 12, విటమిని బి9, ఐరన్ లోపం వల్ల కనిపిస్తాయి. ఆహారం తీసుకునేందుకు అసౌకర్యంగా ఉంటుంది. మసాలతో కూడిన ఆహారాన్ని తినలేరు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు సిట్రస్, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.
స్క్రోటల్ నాలుకకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
నాలుక పగిలినప్పుడు నోటి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. మీ నాలుక పగిలినట్లయితే డెంటిస్టు సలహా తీసుకోవాలి. కొన్నాళ్లపాటు నాలుకపై బ్రష్ చేయకూడదు. మీ ఆహారంలో మార్పులు చేయాలి. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్స్ లోపించినప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి.
విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలు:
గొడ్డు మాంసం, కాలేయం, చికెన్, చేపలు, గుడ్లు, పాలు, వెన్న , చీజ్ వీటిలో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఆహారంలో తరచుగా చేర్చుకోవాలి. ఆహారం రూపంలో తీసుకోనట్లయితే..టాబ్లెట్ రూపంలో కూడా సప్లిమెంట్లను పొందవచ్చు.
విటమిన్ B9 లోపం నుంచి బయటపడటం ఎలా:
విటమిన్ బి9, ఫొలేట్ అని కూడా పిలుస్తారు. బ్రస్సెల్స్ మొలకలు, చిక్ పీస్, కిడ్నీ బీన్స్, క్యాబేజీ, కాలే, స్ప్రింగ్ గ్రీన్స్, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో లభిస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలను కూడా ఉపయోగించవచ్చు. ఏదైనా సప్లిమెంట్లను తీసుకునే ముందు మీ వైద్యుని సలహాను తీసుకోవడం మంచిది. ముడతలు పడిన నాలుక కాకుండా, ఫొలేట్ లోపం వల్ల విపరీతమైన అలసట, శక్తి లేకపోవడం, శరీరంపై సూదులు గుచ్చినట్లు అనిపించడం, నోటిపుండ్లు, గొంతులో మంట, కండరాల బలహీనత, దృష్టిలోపం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అంతేకాదు గందరగోళం, నిరాశ, జ్ఞాపకశక్తి, వంటి మానసిక సమస్యలకు కూడా ఉండవచ్చు. గుండె జబ్బులు, వంధత్వం, గర్భాధారణ వంటి సమస్యలకు దారితీయవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



