CARONA: మీరు కళ్లజోడు పెట్టుకుంటారా..! అయితే కరోనా సోకదు..? షాకింగ్ నిజాలు వెల్లడించిన పరిశోధకులు..
CARONA: భారతీయ పరిశోధకులు వెలువరించిన ఓ అధ్యయనం ప్రకారం కళ్లజోడు ధరించిన వారు కరోనా భారిన పడే అవకాశం చాలా తక్కువట. ఓ ఆసుపత్రిలో 223 మంది పురుషులు, 81 మంది స్త్రీల ( 10 నుంచి
CARONA: భారతీయ పరిశోధకులు వెలువరించిన ఓ అధ్యయనం ప్రకారం కళ్లజోడు ధరించిన వారు కరోనా భారిన పడే అవకాశం చాలా తక్కువట. ఓ ఆసుపత్రిలో 223 మంది పురుషులు, 81 మంది స్త్రీల ( 10 నుంచి 80 మంది మధ్యవయస్కులు) పై రెండు వారాల పాటు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
కళ్లు, చెవులు, నోరు, ముక్కును చేతులతో తాకొద్దని కరోనా వెలుగుచూసిన దగ్గరి నుంచి ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తునే ఉన్నారు. రోజులో ఎక్కువ సమయం కళ్లద్దాలు ధరించేవారు తమ కళ్ల వద్దకు చేతులు పోనిచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని..దాంతో వారికి వైరస్ సోకే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని ఆ అధ్యయనకర్తలు అంటున్నారు. తమ అధ్యయనంలో పాల్గొన్నవారు 23 సార్లు ముఖాన్ని, మూడుసార్లు కళ్లను తాకారని వెల్లడించారు. 19 శాతం మంది రోజుమొత్తంలో ఎక్కువ సమయం కళ్లద్దాలు ధరించారని వెల్లడించారు. దాంతో వాటిని ధరించేవారికి కొవిడ్ సోకే అవకాశం రెండు నుంచి మూడు రెట్లు తక్కువగా ఉండనుందని వారు అభిప్రాయపడ్డారు. అవి రక్షణ తొడుగుల్లా వ్యవహరిస్తాయన్నారు. మానవ శరీరంలోకి కళ్లద్వారా వైరస్ ప్రవేశించడానికి అవకాశం ఉండటంతో.. వైరస్ వచ్చిన కొత్తల్లో కాంటాక్ట్ లెన్స్ వాడేవారు కళ్లద్దాలకు మారమని నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి కొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి తీవ్ర స్థాయిలో కృషి చేసిన అధికారులకు మళ్లీ తలనోప్పులు మొదలయ్యాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తదితర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక గుజరాత్ రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుజరాత్ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో కరోనా కట్టడికి విధించిన రాత్రి సమయంలో కర్ఫ్యూను 15 రోజుల పాటు పొడిగించారు. కరోనా కట్టడికి అహ్మదబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ నగరాల్లో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు మున్సిపల్ నగరాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున రాత్రి సమయంలో కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.14 శాతం ఉండగా.. మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,73,918 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మొత్తం 21,54,35,383 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,42,42,547 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.