AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Patients : డయాబెటిక్ ఉన్నవారు తినాల్సిన ప్రత్యేక ప్రూట్స్ ఏంటో తెలుసా.. ఇవి మాత్రమే రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..

Diabetic Patients : మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి డైట్ చార్ట్ ను సిద్దంచేసుకోవడంలో అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆందోళనా లేకుండా అనుసరించగల

Diabetic Patients : డయాబెటిక్ ఉన్నవారు తినాల్సిన ప్రత్యేక ప్రూట్స్ ఏంటో తెలుసా.. ఇవి మాత్రమే రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..
uppula Raju
|

Updated on: Feb 28, 2021 | 4:57 AM

Share

Diabetic Patients : మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి డైట్ చార్ట్ ను సిద్దంచేసుకోవడంలో అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆందోళనా లేకుండా అనుసరించగల ఆహారాలు కొన్ని ఉన్నాయి. అయితే, వాస్తవానికి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచగల ఆహారాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక పండ్ల విషయానికి వస్తే, ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికల దృష్ట్యా, సహజ సిద్దమైన పండ్లు మరియు కూరగాయలు చేకూర్చే ఆరోగ్యకర ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని, మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు., ఈ సందర్భంలో ఒక గందరగోళాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. పండ్లలోని చక్కెరలు తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి., వాటిని అనుసరించవచ్చునా ? అని. అవునా ? మధుమేహ రోగగ్రస్తులకు సిఫార్సు చేయదగిన ఉత్తమమైన పండ్లు ఏవో తెలుసుకుందాం.

1. గ్రేప్ ఫ్రూట్ : వాస్తవానికి గ్రేప్ ఫ్రూట్లో దాదాపు 91 శాతం నీరు ఉంటుంది. అదేవిధంగా గ్రేప్ ఫ్రూట్లో విటమిన్ సి నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా 25 గా ఉంటుంది మరియు దీనిలో డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలు అధిక మొత్తాలలో ఉంటాయి. గ్రేప్ ఫ్రూట్లో నారింగెనిన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది ఒకరకమైన ఫ్లేవనాయిడ్, ఇది దేహంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంపొందిస్తుంది. కావున మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు రోజూవారీ క్రమంలో భాగంగా గ్రేప్ ఫ్రూట్ తీసుకోవచ్చునని సూచించబడుతుంది.

2. స్ట్రాబెర్రీ : స్ట్రాబెర్రీస్ మీ మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ తో లోడ్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, స్ట్రాబెర్రీలకు గ్లైసీమిక్ ఇండెక్స్ 41 గా ఉంటుంది. మరియు కార్బోహైడ్రేట్లు కూడా తక్కువ మొత్తాలలో ఉంటాయి. స్ట్రాబెర్రీస్ మీ పొట్టను నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. మరియు శక్తిస్థాయిలు కోల్పోకుండా సహాయపడుతుంది. మీ రక్తంలోని చక్కర నిల్వలను క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది. రోజూ సుమారు 3/4 కప్పు స్ట్రాబెర్రీలను తీసుకోవడం మూలంగా, మధుమేహ వ్యాధిగ్రస్తులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పబడుతుంది.

3. నారింజ పండు : పీచు పదార్థంలో ఎక్కువగా ఉండటం, చక్కెరలలో తక్కువగా ఉండటం, విటమిన్ సి మరియు థయామిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం మూలంగా నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతాయి. ఇవి 87 శాతం నీటి నిల్వలను కలిగి ఉండి, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. నారింజ మీ బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మీ మధుమేహాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు, రోజూ నారింజను తీసుకోవచ్చునని చెప్పబడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 44 గా ఉంటుంది.

4. చెర్రీ : తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ 22 గా ఉన్నచెర్రీలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, బీటా కెరోటిన్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం మరియు ఫైబర్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి. చెర్రీస్ మధుమేహరోగులకు అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. అంతేకాకుండా చెర్రీస్ పూర్తిగా ఆంథోసియానిన్స్ ను కలిగి ఉంటుంది. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని 50 శాతం పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కిందికి తీసుకునివస్తాయని నమ్మబడుతుంది. కావున రోజులో తాజా చెర్రీస్ ఒక కప్ మోతాదులో తీసుకోవచ్చునని సూచించబడుతుంది. రోజులో 1 కప్పు చెర్రీలను సేవించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయకారిగా ఉంటుంది.

5. ఆపిల్ : విటమిన్ సి, డైల్యూటెడ్ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆపిల్స్ అధికంగా తీసుకోవడం మూలంగా, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇవి పెక్టిన్ను కలిగి ఉంటాయి., మరియు ఇవి మీ శరీరం నుండి విషతుల్య రసాయనాలను తొలగించడానికి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ అవసరాలను దాదాపు 35 శాతం తగ్గించడానికి సహాయపడతాయి. మరియు దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా 38గా ఉంటుంది.

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. వ్యవస్థాగత నిర్మాణంలో మార్పులు అవసరం.. మరోసారి గళం విప్పిన సీనియర్ నాయకుడు..