AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికంగా చెమట పడుతుందా..! అయితే మీరు ఈ వ్యాధులకు గురై ఉండొచ్చు.. ఒక్కసారి తెలుసుకోండి లేదంటే చాలా నష్టపోతారు..

How to Stop Sweat : కొందరిలో అధిక చెమట చికాకు కలిగిస్తుంది. చెమట నుంచి వెలువడే దుర్వాసన పక్కవారికి అసౌర్యం కలుగుతుంది. కానీ అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం.

అధికంగా చెమట పడుతుందా..! అయితే మీరు ఈ వ్యాధులకు గురై ఉండొచ్చు.. ఒక్కసారి తెలుసుకోండి లేదంటే చాలా నష్టపోతారు..
uppula Raju
|

Updated on: Feb 28, 2021 | 4:55 AM

Share

How to Stop Sweat : కొందరిలో అధిక చెమట చికాకు కలిగిస్తుంది. చెమట నుంచి వెలువడే దుర్వాసన పక్కవారికి అసౌర్యం కలుగుతుంది. కానీ అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం. కొందరిలో అధిక చెమట చికాకు కలిగిస్తుంది. చెమట నుంచి వెలువడే దుర్వాసన పక్కవారికి అసౌర్యం కలుగుతుంది. కానీ అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం. శరీరానికి చెమట పట్టడం మంచిదే. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో అధిక ఉండే వేడి తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన విధి. కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపడుతుంది. అలాంటి సందర్భాల్లో చర్మంపై ఉండే బాక్టీరియాకు చెమట తోడు కావడం వల్ల మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అధికంగా చెమట పట్టడాన్ని పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. చంకలు, పాదాలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల ప్రతి ఒక్కరూ అసౌకర్యంగా భావిస్తుంటారు.

అధికంగా చెమట పట్టడానికి చాలా కారణాలుంటాయి. ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం ఎక్కువగా చెమట పట్టడానికి ప్రధాన కారణాలు. ఒక్కోసారి మధుమేహం ఉన్నవారిని కూడా అధిక చెమట బాధిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఒక్కోసారి స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు అధికంగా పోస్తుంటాయి. సాధారణంగా అధిక చెమట సమస్య యవ్వనంలో ప్రారంభమవుతుంది. మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్‌ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా కూడా చెమటలు పడుతుంటాయి. శరీరంలోని ఇతర భాగాల కంటే అరికాళ్లు, అరచేతుల్లో అధిక చెమట పట్టడానికి కారణం శరీరంలోని ఉష్ణోగ్రత కంటే భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులేనని ఆయుర్వేద డాక్టర్ శ్యాం వీఎల్ వివరించారు. నిద్ర పోయే సమయంలో పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ తలెత్తే అవకాశం లేదని, తద్వారా అధిక చెమట పట్టదని ఆయన పేర్కొన్నారు.

అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలు:

1) చల్లని బ్లాక్ టీలో ముంచిన మెత్తని గుడ్డతో అరచేతులను తుడవాలి. బ్లాక్ టీలో టానిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తస్రావాన్ని నివారించగలుగుతుంది. బ్లాక్ టీలోని ఆస్ట్రిజెంట్ లక్షణాల వల్ల నేచురల్ యాంటీపెర్సెపిరెంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఇది చెమట ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. తరచుగా ఈ పని చేయడం వల్ల అనుకున్న ఫలితం కనిపిస్తుంది. 2) బ్లాక్ టీలో 20 నిమిషాల పాటు మీ అరచేతులను ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది 3) కొద్ది నీటిలో గంధం వేసి పేస్టు చేయండి. దీనిని అరచేతులు, అరికాళ్లు, చంకలు వంటి ప్రదేశాల్లో రాసుకోండి. గంధం బదులు అలోవెరా జెల్‌ను రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది. 4) అధిక కారాలు ఉండే ఆహారాలు, వేడివేడి ఆహార పదార్థాలను తినడం మానండి. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. 5) తెల్లని ఉల్లిపాయ, బ్రకోలి, బీఫ్, లివర్ వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.

భారత్ బంద్‌కు మద్దతుగా దేశంలో పలు చోట్ల రైల్ రోకో.. పట్టాలపై కూర్చొని ఆందోళన

Follow Us
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..