AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali Ayurved: పతంజలి ఔషధంతో అధిక కొలెస్ట్రాల్ సమస్యకు చెక్‌.. పరిశోధనలో కీలక అంశాలు

Patanjali Ayurved: ఈ ఆయుర్వేద మందులు కొలెస్ట్రాల్, దాని సంబంధిత వ్యాధులను నయం చేస్తాయని పతంజలి పరిశోధన పేర్కొంది. ఈ మందులలో దివ్య సర్వకల్ప్ క్వాత్, దివ్య అర్జున్ క్వాత్, పతంజలి సీ బక్‌థార్న్ క్యాప్సూల్, దివ్య లిపిడోమ్ టాబ్లెట్, అలాగే..

Patanjali Ayurved: పతంజలి ఔషధంతో అధిక కొలెస్ట్రాల్ సమస్యకు చెక్‌.. పరిశోధనలో కీలక అంశాలు
Subhash Goud
|

Updated on: May 13, 2025 | 2:04 PM

Share

రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది. దీని వల్ల గుండెపోటుతో పాటు అనేక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రోగి దాని చికిత్స కోసం చూస్తాడు. కానీ నిరంతరం మందులు తీసుకున్న తర్వాత రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కానీ ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తొలగించలేము. దీని కోసం మీరు ఆయుర్వేద సహాయం తీసుకోవచ్చు. పరిశోధన తర్వాత పతంజలి ఆయుర్వేద మందులు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని, వాటికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని పేర్కొంది.

పతంజలి ఐదు ఔషధాల కలయికను తయారు చేసింది. ఈ మందులు రక్తం నుండి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడమే కాకుండా ధమనులలో చిక్కుకున్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను కూడా తొలగిస్తాయని పతంజలి చెబుతోంది. వైద్యుల సలహా మేరకు ఈ మందులు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. సూచించిన పద్ధతి ప్రకారం ఒక నెల పాటు దీనిని తీసుకున్న తర్వాత ప్రభావాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. రోగి పరిస్థితిని బట్టి ఔషధం తీసుకోవడానికి పట్టే సమయం ఎక్కువ లేదా తక్కువ కావచ్చు.

ఇవి పతంజలి ఆయుర్వేద మందులు:

ఈ ఆయుర్వేద మందులు కొలెస్ట్రాల్, దాని సంబంధిత వ్యాధులను నయం చేస్తాయని పతంజలి పరిశోధన పేర్కొంది. ఈ మందులలో దివ్య సర్వకల్ప్ క్వాత్, దివ్య అర్జున్ క్వాత్, పతంజలి సీ బక్‌థార్న్ క్యాప్సూల్, దివ్య లిపిడోమ్ టాబ్లెట్, దివ్య లౌకి ఘన్వతి టాబ్లెట్ ఉన్నాయి. వీటిని సూచించిన పద్ధతి ప్రకారం ఒక నెల పాటు తీసుకోవాలి. ఈ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ సమస్య దాని మూలాల నుండి నిర్మూలించబడుతుందని పతంజలి పరిశోధన పేర్కొంది. రక్తం నుండి కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా, ధమనులలో చిక్కుకున్న కొలెస్ట్రాల్ కూడా తొలగించబడుతుంది. ఆ తరువాత గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం దాదాపుగా తొలగిపోతుంది.

ఇది ఔషధం తీసుకునే పద్ధతి:

దివ్య సర్వకల్ప్ క్వాత్, దివ్య అర్జున్ క్వాత్‌లను ఒక్కొక్క చెంచా కలిపి 400 మి.లీ నీటిలో మరిగించి ఆ నీటిని 100 మి.లీ.కి తగ్గించిన తర్వాత చల్లబరిచి ఖాళీ కడుపుతో అంటే పరగడుపున తాగాలని పరిశోధనలో తేలింది. దీన్ని ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. దీనితో పాటు, పతంజలి సీ బక్‌థార్న్ క్యాప్సూల్‌ను ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. దివ్య లిపిడోమ్ టాబ్లెట్, దివ్య లౌకి ఘనవతి టాబ్లెట్‌ను ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఈ ఆయుర్వేద చికిత్స ప్రయోగాల తర్వాత స్థిరపడిందని, ఇది ప్రయోజనకరంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి