ఏసీలో పిల్లలను పడుకోబెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా.. లేదా..?
వేసవి రాగానే పిల్లల్ని రాత్రివేళలో నిద్రపుచ్చడం తల్లిదండ్రులకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వలన పిల్లలు అసౌకర్యంగా ఫీలై నిద్రపోకుండా బాధపడుతారు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏసీ గదిలో పడుకోబెడుతారు. అయితే పిల్లలు బాగా సున్నితంగా ఉండే వయస్సులో ఉండటంతో ఏసీ గదిలో పడుకోబెడుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఏసీ గాలి నేరుగా పిల్లలపై పడితే వారి శరీర ఉష్ణోగ్రత అసమతుల్యంగా మారతాయి. దీని వలన పిల్లల్లో రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశాలు ఎక్కువ. అందుకే గాలి దిశను తగినట్లు మార్చి గదిలో చల్లదనం సమానంగా పంచుకునేలా చూడాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
చిన్నపిల్లలు చలిని ఎక్కువగా ఫీలవుతారు. గది ఉష్ణోగ్రత ఎక్కువగా తగ్గితే జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలు మారతాయి. కనుక గదిలో ఉష్ణోగ్రతను 24°C నుండి 26°C మధ్య ఉంచితే వారు సురక్షితంగా నిద్రపోవచ్చు.
ఏసీ గదిలో పడుకునేటప్పుడు పిల్లలకు కాటన్ దుస్తులు వేయడం మంచిది. ఇవి శరీరానికి ఒత్తిడి లేకుండా ఉండేలా చేస్తాయి. వీటి వలన వారు సౌకర్యంగా ఫీలై త్వరగా నిద్రపోతారు. మరొకవైపు కాటన్ దుస్తుల వాడకం వల్ల చలితో సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఏసీ గదిలో ఉండే వేళ పిల్లలకు సాధారణంగా దాహం అనిపించదు. కానీ శరీరంలోని తేమ తక్కువై డీహైడ్రేషన్ కి దారితీసే ప్రమాదం ఉంటుంది. కనుక వారికి తరచూ మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, తాజా పండ్ల రసాలు ఇస్తూ ఉండాలి. ఇవి శరీర తేమను నిలిపి ఉంచడంలో ఉపయోగపడతాయి.
ఏసీ గదిలో డోర్లు, కిటికీలు పూర్తిగా మూసేస్తే గాలి ప్రవాహం ఆగిపోతుంది. దీని వలన గదిలోని గాలి శుద్ధి కాని, అశుద్ధిగా మారవచ్చు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. కాబట్టి కొంతమేర కిటికీ లేదా వెంటిలేటర్ తెరిచి ఉంచడం మంచిది.
ఏసీ ఫిల్టర్లు ధూళితో నిండిపోతే వాటి ద్వారా వచ్చే గాలి ఆరోగ్యానికి హానికరం. పిల్లలకు డస్ట్ అలర్జీ, దగ్గు వంటి సమస్యలను తెస్తుంది. కనుక వారానికి ఒకసారి అయినా ఫిల్టర్లను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
చిన్నపిల్లలను ఏసీ గదిలో ఒంటరిగా ఉంచడం మంచిది కాదు. వారు నిద్రపోయే సమయంలో తల్లిదండ్రులలో ఒకరు వారి పక్కనే ఉండాలి. ఇది అవసరమైన వేళ దుప్పటి కప్పడం, నీళ్లు ఇవ్వడం వంటి వాటిలో ఉపయోగపడతాయి.
గది చల్లబడిన తరువాత పిల్లలు నిద్రలోకి వెళ్లిపోయాక ఏసీని ఆఫ్ చేయాలి. దీని వలన సహజ గాలి గదిలోకి ప్రవేశిస్తుంది. దీనితో పిల్లలు చలికి గురవకుండా ఆరోగ్యంగా నిద్రపోతారు. ఏసీ వాడకంలో జాగ్రత్తలు పాటిస్తే పిల్లలకు హాని కలగదు. పై చెప్పిన సూచనలను అనుసరిస్తే వేసవి కాలంలో పిల్లలు చల్లగా, సౌకర్యంగా, ఆరోగ్యంగా నిద్రపోవచ్చు.




