AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paneer: డయాబెటిక్‌ రోగులు పనీర్‌ను తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణుల సలహా ఇదే

పనీర్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. అలాగే తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి.  దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పనీర్ చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

Paneer: డయాబెటిక్‌ రోగులు పనీర్‌ను తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణుల సలహా ఇదే
Paneer
Basha Shek
|

Updated on: Jan 08, 2023 | 9:52 AM

Share

మధుమేహం రోగాన్ని శాశ్వతంగా నివారించలేం కానీ రక్తంలో షుగర్‌ స్థాయులను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు హెల్దీఫుడ్‌ తీసుకోవడం, శారీరక శ్రమ, వ్యాయామాలు చేయడం తదితర అలవాట్లతో రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం పిండి పదార్థాలు తక్కువగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పనీర్‌ కూడా ఒకటి. పనీర్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. అలాగే తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి.  దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పనీర్ చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. డయాబెటిక్ పేషెంట్లు పగలు లేదా రాత్రి భోజనంలో పనీర్ తీసుకోవచ్చు. టోన్డ్ మిల్క్‌తో తయారుచేసిన పనీర్ బ్లడ్ షుగర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు రోజులో 80 నుంచి 100 గ్రాముల పనీర్ తీసుకుంటే సరిపోతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.

ఇలా తీసుకోండి..

పనీర్‌లో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లకు పనీర్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పనీర్‌ను పచ్చిగానైనా లేదా వండిన రూపంలో తీసుకోవచ్చు. పచ్చి పనీర్‌లో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది షుగర్ రోగులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది . ఇది కాకుండా, పనీర్‌ను ప్రత్యేక వంటకంగా కూడా తినవచ్చు. కూరగాయలతో కలిపి సలాడ్లు, లేదా స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ప్రయోజనాలివే..

  • పనీర్ తక్కువ GI కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారం.
  • కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల పనీర్ రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుంది.
  • పనీర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
  • పనీర్‌లో ప్రోటీన్లు, వివిధ సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాన కోసం మాత్రమే. టీవీ9 ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్రువీకరించదు. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..