AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే ఆ సమస్యలన్నీ మటుమాయం..

కాలంతో పరిగెడుతున్న జీవితాలు మనవి. ఎప్పుడూ ఉరుకులు పరుగుల జీవితాలే. కాస్త టైమ్ దొరికితే రిలాక్స్ అవ్వడానికి చూస్తాం. కానీ టైమే ఉండదు. దీనికి తోడు పని ఒత్తిడి.. అందుకే చాలామంది స్ట్రెస్ ఫీల్ కావడం కామన్ అయిపోయింది. దీంతో మానసిక ప్రశాంతత అనేది లేకుండాపోతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Health Tips: వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే ఆ సమస్యలన్నీ మటుమాయం..
Summer Fruits
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: May 07, 2024 | 5:17 PM

Share

కాలంతో పరిగెడుతున్న జీవితాలు మనవి. ఎప్పుడూ ఉరుకులు పరుగుల జీవితాలే. కాస్త టైమ్ దొరికితే రిలాక్స్ అవ్వడానికి చూస్తాం. కానీ టైమే ఉండదు. దీనికి తోడు పని ఒత్తిడి.. అందుకే చాలామంది స్ట్రెస్ ఫీల్ కావడం కామన్ అయిపోయింది. దీంతో మానసిక ప్రశాంతత అనేది లేకుండాపోతోంది. స్ట్రెస్ కారణంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య తలెత్తుతోంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే సింపుల్‌గా మన రెగ్యులర్ డైట్‌లో ఈ ఫ్రూట్‌ను కూడా కలపమంటున్నారు వైద్య నిపుణులు. మరి ఆ పండు వెనుక రహస్యం ఏంటో చూద్దాం..

ఆరెంజ్ ఫ్రూట్స్ ఇవి చూడటానికి అందంగా కనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అందరికీ తెలుసు. ఈ మధ్యే జరిగిన కొన్ని పరిశోధనల్లో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు నిపుణులు. ఆరెంజ్ కలర్‌లో ఉండే కమలా పండ్లు ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతమని చెప్పాలి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, సిట్రిక్ యాసిడ్, కాల్షియం ఇలా శరీరానికి కావాల్సిన అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఫ్యాట్ అనేది ఉండదు. ఈ ఆరెంజెస్‌లో ఉన్న సి-విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దెబ్బలు తగిలినప్పుడు నొప్పిని, గాయాన్ని తగ్గిస్తుంది. వైరస్‌లు దగ్గరికి రాకుండా చేస్తుంది.

జీర్ణ ప్రక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యను తలెత్తనివ్వదు. కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. వాంతులు, వికారం, తలనొప్పి లాంటివి తగ్గుతాయి. ఈ ఆరెంజ్ పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయి పెరగదు. ఉబకాయం రాదు. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఆరెంజ్ వల్ల స్ట్రెస్ హార్మోన్‌ల విడుదల కంట్రోల్‌లో వస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడొచ్చు అని పరిశోధకుల సూచన.