Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Virus: భారత్‏లో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లల పై తీవ్ర ప్రభావం.. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ వ్యాప్తి ఏలా ఉండబోతుందని ప్రపంచవ్యాప్తంగా

Omicron Virus: భారత్‏లో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లల పై తీవ్ర ప్రభావం.. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..
Omicron Virus
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 04, 2021 | 9:55 PM

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ వ్యాప్తి ఏలా ఉండబోతుందని ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. కరోనా వ్యాప్తిపై ఇప్పుడు యావత్ ప్రపంచం భయాందోళనకు గురవుతుంది. ఈ సమయంలో చిన్నారుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరగడంపై దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ డేంజర్‌ కాదు. కానీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. ఐదేళ్ల వయసులోపు పిల్లలపై.. 10 నుంచి 14 ఏళ్ల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. డెల్టా + ఒమిక్రాన్‌–సూపర్‌ స్ట్రెయిన్‌ కలిస్తే ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటిన వారికీ బూస్టర్‌ డోసు వేసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఈ సమయంలో అమెరికా ప్రయాణలపై ఆంక్షాలు విధించింది కేంద్రం.

పిల్లల నుంచి 40 ఏళ్ల లోపు వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ ఒమిక్రాన్ వైరస్ రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేచురల్ ఇమ్యూనిటీతోపాటు.. టీకాలతో రక్షణగా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతుంది కేంద్రం. ప్రతి ఒక్కరి మాస్కులు పెట్టుకోని.. ఫిజికల్​ డిస్టెన్స్ పాటించాలి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… డెల్టా వేరియంట్ వ్యాప్తి వల్ల చాలా మందికి యాంటీబాడీలు ఏర్పడ్డాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినందున కొత్త వేరియంట్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. దేశంలో 40 ఏళ్లు ఆపై వయసున్నోళ్లకు బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ఇండియన్ సార్స్- కరోనా వైరస్ 2 జీనోమిక్స్ కన్సార్షియం(ఇన్సాకాగ్) సిఫార్సు చేసింది.

సౌత్​ ఆఫ్రికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఒమిక్రాన్ కేసులు.. మరిన్ని దేశాలకూ విస్తరించే అవకాశం ఉంది. ఇటు భారత్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి టీకానే మార్గామని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తుంది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదని.. డెల్టా వేరియంట్ కట్టడికి తీసుకున్న చర్యలనే ఒమిక్రాన్ కట్టడి కోసం తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్​వో తెలిపింది. పిల్లలకు టీకాపై పరిశీలన చేయడం.. ఒమిక్రాన్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యమని కేంద్రం భావిస్తోంది. అలాగే విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టాలని.. దేశంలో కరోనా టెస్టుల సంఖ్య వేగవంతం చేసి.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని యోచిస్తోంది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు టీకా ఇచ్చే విషయం గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ లను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.

Also Read: Bheemla Nayak: యూట్యూబ్‏లో భీమ్లా నాయక్ అడవి తల్లి సాంగ్ రికార్డ్స్.. ఈ పాట పాడిన దుర్గవ్వ గురించి తెలుసా..

Deepika Padukone: ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‏కు బాలీవుడ్ బ్యూటీ.. దీపికకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..