Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Obesity in kids: కరోనా ఎఫెక్ట్.. చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. దీనిని ఎలా నివారించవచ్చంటే..

Obesity in kids: కరోనా పరిమితుల కారణంగా, పిల్లలలో శారీరక శ్రమ నిరంతరం తగ్గుతోంది. వారిలో ఊబకాయం పెరుగుతోంది. ఊబకాయం ఉన్న పిల్లలకు డయాబెటిస్, గుండె జబ్బులు, ఉబ్బసం, నిద్ర రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.

Obesity in kids: కరోనా ఎఫెక్ట్.. చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. దీనిని ఎలా నివారించవచ్చంటే..
Obasity In Kids
Follow us
KVD Varma

|

Updated on: Jun 05, 2021 | 4:42 PM

Obesity in kids: కరోనా పరిమితుల కారణంగా, పిల్లలలో శారీరక శ్రమ నిరంతరం తగ్గుతోంది. వారిలో ఊబకాయం పెరుగుతోంది. ఊబకాయం ఉన్న పిల్లలకు డయాబెటిస్, గుండె జబ్బులు, ఉబ్బసం, నిద్ర రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం, కూరగాయలు, పండ్లను రోజుకు రెండుసార్లు ఆహారంలో తీసుకుంటే, ఊబకాయం వచ్చే ప్రమాదం 25 శాతం తగ్గుతుంది. అమెరికన్ సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం, 6 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజూ కనీసం 1 గంట పాటు మితమైన, శక్తివంతమైన శారీరక శ్రమలో పాల్గొనాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఇంట్లోనే వారి శారీరక శ్రమను పెంచడం ద్వారా పిల్లలను ఆరోగ్యంగా ఉంచవచ్చు. పిల్లలలో ఊబకాయం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో నిపుణులు ఇలా చెబుతున్నారు.

టీవీ చూసేటప్పుడు ఆహారం ఇవ్వవద్దు..

ఇది ఊబకాయానికి కారణం అవుతుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, పిల్లలలో ఊబకాయం పెరగడానికి ఒక కారణం వారి స్క్రీన్ ఎక్స్పోజర్. టీవీ, మొబైల్ లేదా కంప్యూటర్‌ను ఎక్కువసేపు ఉపయోగించే పిల్లలకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అంటే ఎక్కువ స్నాక్స్ తినడం లాంటివి చేస్తారు. దీంతో అధిక చక్కెర, అధిక కొవ్వు పిల్లల్లో ఏర్పడుతుంది. దీంతో ఊబకాయం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.

పెద్దలు జాగ్రత్తగా ఉండాలి..

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హెల్త్‌ చెబుతున్న దాని ప్రాకారం తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం తమ అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. పరిశోధనలో, తల్లిదండ్రుల మంచి ఆహారపు అలవాట్లను, ఫిట్నెస్ అవగాహనను చూడటం ద్వారా, పిల్లలు వాటిని సులభంగా స్వీకరిస్తారు. అదేవిధంగా వారు తల్లిదండ్రుల నుంచి చెడు అలవాట్లను కూడా అంతకంటే త్వరగా అనుకరించే ప్రయత్నం చేస్తారు.

వయస్సు ప్రకారంఈ విధంగా ఆహారం..

మూడేళ్ల పిల్లలకి 1000 నుండి 1400 వరకు, 9-13 సంవత్సరాల వారికి 1400 నుండి 2200 కేలరీలు అవసరం. ఈ 4 విషయాలను వారి ఆహారంలో చేర్చండి. మొదటిది: పండు మరియు కూరగాయలు … . ఇది వారికి విటమిన్లు, ఫైబర్ మరియు అవసరమైన ఖనిజాలను ఇస్తుంది. రెండవది: మిశ్రమ గింజలు. ఇది వారికి కాల్షియం, మెగ్నీషియం వంటి అంశాలను ఇస్తుంది. మూడవది: తృణధాన్యాలు…. నాల్గవది: పాల ఉత్పత్తులు. పిల్లలు తినేదానికి అనుగుణంగా శారీరక శ్రమ చేయాలి అని గుర్తుంచుకోండి.

పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశాన్ని ఎలా తెలుసుకోవాలి?

  • బీఎంఐ ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు
  • బీఎంఐ ద్వారా ఈ విషయాన్నీ తెలుసుకోవచ్చు. బీఎంఐను తనిఖీ చేయడానికి ఆన్‌లైన్ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి.
  • 18 నుంచి 22 మధ్యబీఎంఐ ఆరోగ్యకరమైన పిల్లలకు సంకేతం.
  • 25 కంటే ఎక్కువ బీఎంఐ ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
  • 15 కంటే తక్కువ బీఎంఐ బరువు తక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

Also Read: Aortic Aneurysm: సైలెంట్ కిల్లర్ బృహద్ధమని సంబంధ అనూరిజం అంటే ఏమిటి? దీనిని గుర్తించడం ఎలా?

కరోనా నివారణకు కషాయాలు తాగుతున్నారా ? వేసవిలో కషాయాలు తాగితే మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు