AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చలికాలంలో మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలంటే ఈ లడ్డూలు తినాల్సిందే.. బరువు కూడా తగ్గుతారు..

చాలా మంది స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. కానీ తీపిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితిలో నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

Health Tips: చలికాలంలో మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలంటే ఈ లడ్డూలు తినాల్సిందే.. బరువు కూడా తగ్గుతారు..
Daliya Ladoo
Shiva Prajapati
|

Updated on: Nov 20, 2022 | 1:49 PM

Share

చాలా మంది స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. కానీ తీపిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితిలో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. శీతాకాలంలో రుచితో పాటు.. ఆరోగ్యవంతమైన పదార్థాలను తినొచ్చు. ఈ సీజన్‌లో ఓట్‌మీల్‌తో చేసిన లడ్డూలను హాయిలా లాగించేయొచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలైనా, పెద్దలైనా అందరూ ఈ లడ్డూలను చాలా ఇష్టపడతారు. ఈ లడ్డూలను తయారు చేయడానికి బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి ఉపయోగిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఓట్‌మీల్ లడ్డూలను ఇంట్లోనే ఏ విధంగా సులువుగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓట్‌మిల్ లడ్డూ తయారీకి కావాల్సినవి..

1. 3 కప్పుల వోట్‌మిల్.

2. 1 కప్పు తురిమిన ఎండు కొబ్బరి.

ఇవి కూడా చదవండి

3. 1 కప్పు పొడి బెల్లం.

4. 1 కప్పు పాలకోవా.

5. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి.

6. అర టీస్పూన్ యాలకుల పొడి.

9. తరిగిన పొడి పండ్లు.

ఓట్‌మిట్ లడ్డూ ఎలా చేయాలంటే..

1. ఒక పాన్ తీసుకోవాలి. తక్కువ మంట మీద వేడి చేయాలి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. కాసేపటి తరువాత బయటకు తిసి ఒక గిన్నేలో సపరేట్‌గా పెట్టుకోవాలి.

2. ఓట్‌మిల్‌ను గుజ్జుగా, ద్రవం మాదిరిగా ఉడికించాలి. ఆ తరువాత కిందకు దించి పక్కన పెట్టుకోవాలి.

3. మళ్లీ పాన్ వేడి చేయాలి. అందులో బెల్లం వేయాలి. పాకం అయ్యేంత వరకు వేడి చేయాలి. ఆ తరువాత, కొబ్బరి, పాలకోవా, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడిని కలపాలి.

4. మంటను ఆపివేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి ఓట్‌మిట్ కలపాలి. ఇవన్నీ కలిపి చిన్న లడ్డూలను తయారు చేయండి.

ఓట్ మీల్ లడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఓట్ మీల్ లో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. చలికాలంలో రోజూ ఒక లడ్డూ తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఓట్‌మీల్ లడ్డూలను తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఇందులో వాడే బెల్లం, డ్రై ఫ్రూట్స్‌లోని పోషకాలు కూడా మీ శరీరానికి అందుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..