AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Health Care: చలికాలంలో మీ పిల్లలు నిరంతరంగా దగ్గుతున్నారా? ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పని చేయండి..

చలికాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు. జలుబు, దగ్గు సమస్య అందరికి నరకం చూపిస్తుంది. అయితే, పెద్దలు తట్టుకోగలరు కానీ, పిల్లలో జలుబు, దగ్గు సమస్య వారిని మరింత క్షీణింపజేస్తుంది.

Shiva Prajapati
|

Updated on: Nov 20, 2022 | 1:54 PM

Share
చలికాలంలో మీ పిల్లలు నిరంతరంగా దగ్గుతున్నట్లయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యంగా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది.

1 / 6
పిల్లలకు దగ్గు వస్తే ఇంట్లోనే ఉంచి దగ్గు సిరప్ ఇస్తుంటారు కొందరు. తగ్గితే పర్వాలేదు కానీ, విపరీతంగా దగ్గు వస్తున్నట్లయితే వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.

2 / 6
శ్లేష్మంతో దగ్గు, పొడి దగ్గు వంటి అనేక రకాల దగ్గులు ఉన్నాయి. దగ్గు అనేక కారణాల వల్ల వస్తుంది. పిల్లల్లో దగ్గుకు కొన్ని కరాణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

3 / 6
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. పిల్లలు పాఠశాలకు దూరమవడానికి సాధారణ జలుబు ప్రధాన కారణం. అనేక వైరస్‌లు జలుబుకు కారణమవుతున్నప్పటికీ, రైనోవైరస్‌లు ప్రధానంగా పేర్కొంటున్నారు నిపుణులు.

4 / 6
ఫ్లూ అనేది ఒక అంటు వ్యాధి. ఇది సాధారణ జలుబు కంటే పిల్లలకు చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో, ఫ్లూ కారణంగా పొడి దగ్గు కనిపిస్తుంది. ఇన్ఫ్లుఎంజా వైరస్ దీనికి కారణమవుతుంది.

5 / 6
మీ బిడ్డకు ఏదైనా రకమైన దగ్గు ఉంటే, వైద్యుని సలహా లేకుండా వారికి ఎటువంటి మందులు ఇవ్వొద్దు. అది వారికి హానికరం అవ్వొచ్చు. చాలా వరకు దగ్గులు 1 నుండి 2 వారాల్లో మెరుగవుతాయి. మీ పిల్లల దగ్గు 2 నుండి 3 వారాల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోండి.

6 / 6