పొట్ట గుట్టలా మారితే బాడీ షెడ్డుకేనట..! ఊబకాయాన్ని లైట్ తీసుకోకండి.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు
అధిక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ - BMI ) మాత్రమే కాదు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పరిశోధనను ఫోర్టిస్ హాస్పిటల్, AIIMS, నేషనల్ డయాబెటిస్ ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్ సంయుక్తంగా చేశాయి. కొత్త పరిశోధనలో ప్రత్యేకత ఏమిటి..? ఆరోగ్య నిపుణులు ఎలాంటి సూచనలు ఇచ్చారు.. బీఎంఐ అంటే ఏమిటి..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం పెను సమస్యగా మారింది.. అధిక బరువుతో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ప్రస్తుత కాలంలో ఊబకాయం నిర్వచనం మారిపోయిందని.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.. మీ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ నియంత్రణలో ఉన్నా. కానీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది ఆరోగ్యానికి మంచిది కాదు.. దీని అర్థం ఇది మేము చెబుతున్నది కాదు.. కొత్త పరిశోధన వెల్లడిస్తున్న వివరాలివి.. న్యూఢిల్లీలోని NDOC, AIIMS, Fortis హాస్పిటల్‌ల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఊబకాయానికి సంబంధించి ఈ సంస్థలు కొత్త నిర్వచనం కూడా ఇచ్చాయి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు అనేక ఇతర వ్యాధులకు ఆహ్వానం పలుకుతోందని అధ్యయనంలో తేలింది. ఊబకాయం కారణంగా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి అనేక ఇతర వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. కొత్త అధ్యయనంలో, ఊబకాయం రెండు వర్గాలుగా విభజించారు.. మొదటిది సాధారణ ఊబకాయం (ఇన్నోక్యూస్ ఒబేసిటీ), రెండవది పరిణామాలతో కూడిన ఊబకాయం గురించి వివరించారు.
సాధారణ స్థూలకాయం (Innocent Obesity)..
ఈ స్థూలకాయంలో వ్యక్తి BMI పెరుగుతుంది.. ఊబకాయం శరీరంపై కనిపిస్తుంది.. కానీ ఇది రోజువారీ పని లేదా ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపదు. అంటే అలాంటి వ్యక్తికి ఊబకాయం పనికి ఆటంకంగా మారదు. అయితే, దీనిని నియంత్రించకపోతే, అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది.
పరిణామాలతో ఊబకాయం (Obesity with consequences)..
రెండవ దశలో, ఊబకాయం బయటకు కనిపించడమే కాకుండా శరీరంలోని అనేక ఇతర భాగాలకు హాని చేస్తుంది. తర్వాత అనేక వ్యాధులకు కారణం అవుతుంది. స్థూలకాయులకు మధుమేహం, గుండె జబ్బులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అటువంటి పరిస్థితిలో, కొత్త అధ్యయనం ఈ వ్యాధులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి, స్థూలకాయాన్ని సరిగ్గా గుర్తించడంలో సహాయపడుతుంది.
15 ఏళ్ల తర్వాత ఊబకాయంపై కొత్త పరిశోధన..
15 ఏళ్ల తర్వాత ఊబకాయంపై కొత్త పరిశోధనలో అనేక షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కొత్త అధ్యయనంలో, ఊబకాయాన్ని నియంత్రించడానికి వివరణాత్మక సమాచారం ఇచ్చారు.. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చే ఇతర వ్యాధులను కూడా సులభంగా గుర్తించడం గురించి వివరించారు. అటువంటి పరిస్థితిలో, ఊబకాయం వల్ల కలిగే వ్యాధుల చికిత్సకు ఇప్పుడు సులభంగా, మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఊబకాయంపై కొత్త మార్గదర్శకాలు 2009లో వచ్చాయి. అందులో చాలా విషయాలు స్పష్టంగా కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, కొత్త అధ్యయనం రావడం స్థూలకాయం, దానికి సంబంధించిన ఇతర సమస్యలను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది.
BMI అంటే ఏమిటి?..
BMI అనగా బాడీ మాస్ ఇండెక్స్.. ఇది ఒక వ్యక్తి బరువు – ఎత్తును బట్టి నిర్ణయించబడిన కొలత.. ఇది వ్యక్తి బరువును తెలియజేస్తుంది. BMI ప్రకారం, అధిక బరువు ఉన్న పరిస్థితిని, ఆ పైన ఉన్న పరిస్థితిని ఊబకాయంగా పేర్కొంటారు.. శరీర కొవ్వు పరిమాణాన్ని (మీ మొత్తం శరీర కొవ్వు – ఉజ్జాయింపు కొలత) అంచనా వేయడానికి ఉపయోగించే మెడికల్ స్క్రీనింగ్ సాధనం. ఇది ఎవరైనా తక్కువ బరువు, అధిక బరువు, లేదా ఊబకాయం ఉన్నారో లేదో స్పష్టంగా గుర్తించడానికి ఉపయోగిస్తారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..