- Telugu News Photo Gallery Turmeric and Black Pepper Water: Consume this powerful drink on an empty stomach to reduce bad cholesterol in body
కొలెస్ట్రాల్‌కు పవర్‌ఫుల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే మీ కొవ్వును కోసి బయటకు తీస్తుంది..
కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. మంచి కొలెస్ట్రాల్‌ను HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు) అని, చెడు కొలెస్ట్రాల్‌ను LDL (తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ ) అని పిలుస్తారు. LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి, HDL కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. అయితే.. ఈ పానీయం పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ సమస్య దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Updated on: Jan 15, 2025 | 9:16 PM

ఉరుకులు పరుగుల జీవితం.. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ కారణంగా సిరల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు, రక్తప్రసరణ మందగిస్తుంది.. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ అనేది కొవ్వు (లిపిడ్ అని కూడా పిలుస్తారు).. ఇది మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం. అయితే.. చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర సమస్యలను పెంచుతుంది. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.

అయితే.. కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. మంచి కొలెస్ట్రాల్‌ను HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు) అని, చెడు కొలెస్ట్రాల్‌ను LDL (తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ ) అని పిలుస్తారు. LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి, HDL కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. అయితే.. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఈ నీటిని మీ దిన చర్యలో భాగం చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.. మీరు ఉదయాన్నే ఈ మసాలా నీటిని తాగితే.. కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.

అధిక బరువుతో లేదా చెడు కొలెస్ట్రాల్ బాధపడుతుంటే.. దాన్ని తగ్గించడానికి.. మీరు పసుపు - నల్ల మిరియాల నీటిని తీసుకోవచ్చు. ఈ నీటిని రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని సూచిస్తున్నారు.

పసుపు - నల్ల మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్ వంటి పోషకాలు పసుపు, నల్ల మిరియాలు రెండింటిలోనూ కనిపిస్తాయి.. ఇవి కొలెస్ట్రాల్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి.

పసుపు - నల్ల మిరియాల నీటిని ఎలా తయారు చేయాలి: ఒక పాత్రలో ఒక గ్లాసు నీటిని తీసుకుని వేడి చేయండి. ఈ నీటిలో అర టీస్పూన్ పసుపు, ఎండుమిరియాల పొడి కొంచెం వేసి నీటిని మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)




