Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H1B Visa: హెచ్‌1బి వీసా గురించి ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

H1B Visa: హెచ్‌1బి వీసా గురించి ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Phani CH

|

Updated on: Jan 23, 2025 | 5:16 PM

హెచ్1బీ వీసాల విస్తరణపై డొనాల్డ్‌ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు.

తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయన్నారు. అయితే, సమర్థులు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లో మీడియాకు తెలిపారు. ‘ఈ అంశంపై నాకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి. సమర్థవంతులైన వ్యక్తులు మన దేశంలోకి రావడాన్ని నేనూ ఇష్టపడతాను. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లడటం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నా. దేశంల వ్యాపారరంగాన్ని విస్తరించేందుకు మాకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది హెచ్‌1బీ వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను రెండు వాదనలనూ సమర్థిస్తున్నా’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు హెచ్‌1బీ వీసా ఉపయోగపడుతోందని ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భిన్నమైన వాదనను వినిపించారు. ‘నేను సౌత్‌ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నిరుద్యోగం రేటు 11 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్‌ తయారీలో రాణిస్తున్నారు. సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యారంగంపై దృష్టిసారించాలి. అంతేకానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దు’ అని స్పష్టంగా తన అభిప్రాయాన్ని వినిపించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుంభమేళాలో రష్యన్‌ బాబా.. ఈయన బ్యాగ్రౌండ్ ఇదే..

తేనెకళ్ల సుందరికి బంపర్‌ ఆఫర్ బాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్‌..

Donald Trump: ట్రంప్‌ దూకుడు.. ఆ ఉద్యోగులందరికీ లే ఆఫ్‌లు..

ఫ్రెండ్ ఫ్రెండే.. బిజినెస్ బిజినెస్సే.. ఇండియాతోనూ ట్రంప్ ట్రేడ్ వార్ ??

Hyderabad: హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ కలకలం