తేనెకళ్ల సుందరికి బంపర్ ఆఫర్ బాలీవుడ్ సినిమాలో ఛాన్స్..
ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలవుతోంది. అంతేకాదు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీరంగంలోకి రావాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు.. వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనెకళ్లు.. చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయ్యింది. అయితే యూట్యూబర్లు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటుండంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆమెను తన తండ్రికి ఇంటికి పంపించేశాడు. కానీ అదృష్టం ఆమెనే వెదుక్కుంటూ వెళ్లి ఆమె ఇంటి తలుపు తట్టింది. ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Donald Trump: ట్రంప్ దూకుడు.. ఆ ఉద్యోగులందరికీ లే ఆఫ్‌లు..
ఫ్రెండ్ ఫ్రెండే.. బిజినెస్ బిజినెస్సే.. ఇండియాతోనూ ట్రంప్ ట్రేడ్ వార్ ??
Hyderabad: హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ కలకలం
తెలంగాణలో రేషన్ కార్డు దారులకు అలర్ట్..
Rashmika Mandanna: అయ్యో.. రష్మికకు ఏమైంది? వీల్ ఛైర్‌లో ఇలా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

