ఏ వయస్సు వారు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలో తెలుసా?
TV9 Telugu
23 January
202
5
మన మానసిక-శారీరక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ఎవరైనా తగినంత నిద్రపోకపోతే, అది ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్(CDC) ప్రకారం.. ఏ వయస్సు వారు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలో అన్న విషయంపై ఓ నివేదిక వెలువడింది.
0-3 నెలల పిల్లవాడు రోజూ 14 నుండి 17 గంటలు, 4 నుండి 12 నెలల పిల్లలు 12 నుండి 16 గంటలు, 2 సంవత్సరాలలోపు పిల్లలు 11 నుండి 14 గంటలు నిద్రపోవాలి.
3 నుండి 5 సంవత్సరాల పిల్లలు 10 నుండి 13 గంటలు, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలు 9 నుండి 12 గంటలు నిద్ర అవసరం.
13 నుండి 17 సంవత్సరాల పిల్లలు 8 నుండి 10 గంటల వరకు నిద్రపోవాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక చెబుతుంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, 18 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు రోజుకు 7 - 8 గంటలు నిద్రపోవాలి.
CDC పరిశోధన ప్రకారం, 61 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ప్రతిరోజూ 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి.
65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
భాగ్యనగరంలో నివసించిన 90స్ కిడ్స్‌కి ఇవి తీపి జ్ఞాపకలు..
భారతీయ నయాగరా జలపాతన్నీ ఒక్కసారైనా చూడాలి..
కొబ్బరి పిండి రోటీలు తెలుసా.? అనేక లాభాలు..