Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అకస్మాత్తుగా క్లాస్ నుండి బయటకు వచ్చిన విద్యార్థి.. మూడవ అంతస్తు నుండి దూకాడు!

అనంతపూర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అందరు చూస్తుండగానే విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్న తీరు అందరిని కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన కాలేజీ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది. క్లాస్ రూమ్‌లో నుంచి సరదా బయటకు నడుచుకుంటూ వచ్చిన విద్యార్థి, మూడవ అంతస్తు పైనుంచి దూకాడు.

Andhra Pradesh: అకస్మాత్తుగా క్లాస్ నుండి బయటకు వచ్చిన విద్యార్థి.. మూడవ అంతస్తు నుండి దూకాడు!
Student Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 23, 2025 | 5:34 PM

అనంతపురం జిల్లాలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న చరణ్‌ సడెన్‌గా కాలేజ్‌ బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. క్లాస్‌ రూం నుంచి బయటకు వచ్చి.. అంతా చూస్తుండగానే మూడో అంతస్తు రెయిలింగ్‌ నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజ్‌ ఎదుట ఆందోళనను నిర్వహించాయి.

ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్న తీరు అందరిని కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన కాలేజీ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది. ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థి ఉదయం 10:15 గంటల సమయంలో అకస్మాత్తుగా తరగతి మధ్యలో బయటకు వచ్చి ఈ చర్యకు పూనుకున్నాడు. విద్యార్థి క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భవనం అంచుపై నుంచి దూకినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

ఘటన జరిగిన సమయంలో క్లాస్‌లో పాఠాలు జరుగుతున్నాయి. ఆ విద్యార్థి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా క్లాస్ నుంచి వెళ్లిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత నేరుగా భవనం అంచుకు చేరుకుని మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. విద్యార్థి ఈ చర్య పాల్పడ్డ వెంటనే, అతని సహవిద్యార్థులు బయటికి పరిగెత్తారు. హుటాహుటీన విద్యార్థి చరణ్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

వీడియో చూడండి..

ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. అలాగే విద్యార్థి మానసిక స్థితిపై కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి సమాచారం సేకరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..