Anakapalli: చెక్‌పోస్ట్ వద్ద కంటైనర్ లారీలో తనిఖీలు.. లోపల ఉన్నది చూసి మైండ్ బ్లాంక్
ఓ కంటైనర్ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర దాన్ని ఆపారు. తనిఖీల్లో భాగంగా దాన్ని ఓపెన్ చేసి చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. అందులో దిమ్మతిరిగే సీన్ కనిపించింది. కంటైనర్‌లో లగేజీకి బదులుగా.. ఏముందో చూస్తే
రోజురోజుకూ కేటుగాళ్ల తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి వివిధ రకాలలో అక్రమ రవాణాను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొందరు తెలివితేటలూ చూస్తే.. ప్రజలతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఇక ఈ కోవకు చెందిన ఓ ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ కంటైనర్ లారీ అనుమానస్పదంగా కనిపించింది. ఇక ఆ లారీ ఆపి చెక్ చేయగా.. అందులో కనిపించిన సీన్ చూసి.. దెబ్బకు షాక్ అయ్యారు. లగేజి బదులుగా గోమాంసాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ మాంసాన్ని కోల్‌కతా నుంచి చెన్నై తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సుమారు 23 టన్నుల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఖాకీలు.. వాటిని పరీక్ష చేయించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి