రెండు రోజులు మరింత చలి.. బీ కేర్‌ఫుల్
దేశంలో ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలేకుండా అన్నిప్రాంతాల్లో చలి విజృంభించింది. పొగమంచుతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి చంపేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో రెండురోజుల్లో చలి తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే మూడురోజులు అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండురోజుల పాటు పలుచోట్ల సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని చెప్పింది. రాబోయే కొద్దిరోజులు పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదవుతుండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో 5 డిగ్రీలకు పడిపోతాయని పేర్కొంది. చలి కాలం, ప్రాణాలను బలి కోరే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. ఎర్లీ మార్నింగ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లాంటివి ఆపాలని..ఎండ వచ్చాకే ఎక్సర్‌సైజులు చేయాలని సూచిస్తున్నారు. నీటిశాతం ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. చలి తీవ్రతను బట్టి వృద్దులు, రోగులతో పాటు చిన్న పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలు రావడం, ప్రాణానికి పెను ప్రమాదం అంటున్నారు వైద్యులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్తతో గొడవపడి వచ్చిన మహిళపై సామూహిక లైంగికదాడి
H1B Visa: హెచ్1బి వీసా గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
కుంభమేళాలో రష్యన్ బాబా.. ఈయన బ్యాగ్రౌండ్ ఇదే..
తేనెకళ్ల సుందరికి బంపర్ ఆఫర్ బాలీవుడ్ సినిమాలో ఛాన్స్..
Donald Trump: ట్రంప్ దూకుడు.. ఆ ఉద్యోగులందరికీ లే ఆఫ్‌లు..

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
