Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను అండ్ ఆల్ రౌండర్, జోక్స్ కూడా బాగా చేస్తాడు.. మనసులో మాట చెప్పిన వైష్ణవి

సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.

అతను అండ్ ఆల్ రౌండర్, జోక్స్ కూడా బాగా చేస్తాడు.. మనసులో మాట చెప్పిన వైష్ణవి
Vaishnavi Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 24, 2025 | 10:19 AM

ఈ మధ్య కొంతమంది హీరోయిన్  సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సొంతం చేసుకొని ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అలంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. పలు షార్ట్ ఫిలింస్ ద్వారా అభిమానులను ఆకట్టుకుంది. అందం అభినయం ఉన్న ఈ చిన్నది తెలుగులో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. నాని టాక్ జగదీశ్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఆ మధ్య బేబీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తుంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు వైష్ణవి చైతన్యకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత లవ్ మీ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

జాక్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డతో వర్క్ చేయడం ఎలా ఉందని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ వైష్ణవిని అడిగాడు. దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘సిద్ధూతో వర్క్ చేయడం చాలా గ్రేట్‌గా భావిస్తున్నా. సిద్ధూ వర్సటైల్ యాక్టర్, అండ్ ఆల్ రౌండర్. జోక్స్ కూడా బాగా చేస్తాడు. అండ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అతను నిజంగా స్టార్ బాయ్ సిద్ధూనే’ అంటూ రాసుకొచ్చింది వైష్ణవి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో మొదట చెట్టా..స్త్రీనా చూశారు.. మీరు ఎలాంటి వారంటే
ఈ చిత్రంలో మొదట చెట్టా..స్త్రీనా చూశారు.. మీరు ఎలాంటి వారంటే
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..