రైస్ వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడగాలి ? నీళ్లలో ఎంతసేపు నానబెట్టాలి?

మన ఆహారంలో రైస్ చాలా ముఖ్యమైనది. కానీ బియ్యం వండే ముందు 2-3 సార్లు శుభ్రంగా కడగడం ద్వారా రాళ్లు, ధూళి, పురుగులను తొలగించవచ్చు. రైస్‌ను 15-30 నిమిషాలు నానబెట్టడం వల్ల అది మెత్తగా ఉడుకుతుంది, జీర్ణక్రియ సులభతరమవుతుంది, శరీరానికి అవసరమైన పోషకాలు మెరుగ్గా అందుతాయి. పైగా ఇది నిద్ర సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రైస్ శుభ్రతను పాటించడం మన ఆరోగ్యానికి మంచిది.

రైస్ వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడగాలి ? నీళ్లలో ఎంతసేపు నానబెట్టాలి?
Why Soaking Rice Is Important Before Cooking
Follow us
Prashanthi V

|

Updated on: Jan 16, 2025 | 9:31 AM

మన రోజువారీ ఆహారంలో చాలా ముఖ్యమైనది రైస్. ఏ రకమైన వంట చేయాలన్న దానికి రైస్ చాలా అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైస్ వండే విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. కానీ తీసుకోవాలంటున్నారు నిపుణులు. రైస్ వండే ముందు శుభ్రంగా కడగడం చాలా అవసరమట. బియ్యంలో రాళ్లు, ధూళి, పురుగులు ఉంటే అవి వంటకు మంచివి కావు అంటున్నారు. రైస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వంట చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ 3 టైమ్స్ వాష్ చేయాలి..?

రైస్ ని వండే ముందు శుభ్రంగా కడగడం చాలా అవసరం. బియ్యంలో రాళ్లు, ధూళి, పురుగులు ఉంటే అవి వంటకు మంచివి కావు. అందుకే బియ్యాన్ని 2 లేదా 3 సార్లు నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మురికి పోతుంది. అలాగే ఈ రైస్ ని తిన్న ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవు.

రైస్ నానబెట్టడం కూడా ముఖ్యం

రైస్ నానబెట్టడం వల్ల మెత్తగా ఉడికేలా చేస్తుంది. ఇది జీర్ణక్రియ సులభంగా జరిగేలా చేస్తుంది. ప్రతి రోజు వంటలో రైస్ ని నానబెట్టి వాడటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వంటకాల రుచిని కూడా మెరుగుపరుస్తుంది.

రైస్ ఎంతసేపు నానబెట్టాలి ?

బాస్మతి రైస్ అయితే 30 నిమిషాలు నానబెట్టాలి. సాధారణ రైస్ అంటే చిన్న ధాన్యాలతో ఉండే రైస్ ని 15-20 నిమిషాలు నినబెడితే సరిపోతుంది. ఇలా ఈ సమయానికి నానబెట్టడం వల్ల వంట ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది పైగా రైస్ రుచిగా ఉంటుంది.

నానబెట్టడం వల్ల లాభాలు

ఇలా రైస్ ని నానబెట్టడం ద్వారా స్టార్చ్ కొంతమేరకు తగ్గిపోతుంది. ఇది బియ్యాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ రైస్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మెరుగ్గా అందుతాయి. పైగా నిద్ర సరిగా పట్టడంలో కూడా సహాయపడుతుంది.

ఎలా నానబెట్టాలి ?

ఒక గిన్నెలో రైస్ తీసుకుని 3 టైమ్స్ వాష్ చేయండి. ఇలా చేశాక రైస్ కంటే ఎక్కువ వాటర్ ని వేసి కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది. వంట చేసే ముందు ఈ నీటిని పారబోసి వేరే నీటిని తీసుకోండి. నానబెట్టి వంట చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా రైస్ అవుతుంది. దీని వల్ల మీ గ్యాస్, కరెంట్ రెండు కూడా ఆదా అవుతాయి.

రైస్ తో మంచి ఆరోగ్యం

ఇలా నానబెట్టిన రైస్ తినడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. ఇది శక్తిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఇది నిద్ర సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.