కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..? ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్నారా..?
మన శరీరంలో LDL చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులు చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగతాగడం మానేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షించుకోవచ్చు.

Cholesterol
మన శరీరంలో LDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది గుండె సమస్యలు, స్ట్రోక్ లాంటి ప్రమాదకరమైన జబ్బులకు కారణమవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి మన జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఆహారంలో మార్పులు
- ప్రాసెస్ చేసిన ఆహారాలు వద్దు.. ప్యాకేజ్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ నూనెలో వేయించిన పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ మానుకోండి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను బాగా పెంచుతాయి.
- రెడ్ మీట్ తగ్గించండి.. గొర్రె మాంసం, పంది మాంసం వంటి ఎర్ర మాంసంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వీలైనంత వరకు తినడం తగ్గించండి.
- స్వీట్లు, చక్కెర పానీయాలు దూరం పెట్టండి.. ఎక్కువ చక్కెరలు, నూనెలు ఉన్న స్వీట్లు, కేకులు, కూల్ డ్రింక్స్ లాంటివి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. వీటిని తగ్గించడం మంచిది.
- మంచి ఫైబర్, కొవ్వులు ఉన్న ఆహారం.. మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, ఒలివ్ ఆయిల్ లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు చేర్చండి. ఇవి మంచి కొలెస్ట్రాల్ పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
జీవనశైలిలో మార్పులు
- రోజు వ్యాయామం చేయండి.. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా యోగా లాంటి వ్యాయామాలు చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. వ్యాయామం గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
- బరువును అదుపులో ఉంచుకోండి.. అధిక బరువు కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక కారణం. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం సరైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి.
- పొగతాగడం, మద్యం మానేయండి.. సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వీటిని పూర్తిగా మానుకోవడం మంచిది.
- ఒత్తిడిని తగ్గించుకోండి.. మానసిక ఒత్తిడి కూడా కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మెడిటేషన్, యోగా, ప్రశాంతంగా ఉండటం లాంటి పద్ధతులు పాటించి ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని గుండె సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
Follow Us
