AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lungs Health: స్మోకింగ్ మాత్రమేకాదు.. ఈ అలవాట్లు కూడా మీ ఉపిరితిత్తులను షెడ్డుకు పంపేస్తాయ్! వెంటనే మానుకోండి..

పొగాకు ఉత్పత్తులు తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయని దాదాపు అందరికీ తెలిసిందే. అయినా చాలా మంది ఈ అలవాట్లను అంత సులువుగా వదులుకోలేరు. ధూమపానం ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. ధూమపానం, పొగాకు వినియోగం మాత్రమే కాదు..

Lungs Health: స్మోకింగ్ మాత్రమేకాదు.. ఈ అలవాట్లు కూడా మీ ఉపిరితిత్తులను షెడ్డుకు పంపేస్తాయ్! వెంటనే మానుకోండి..
Lungs Health
Srilakshmi C
|

Updated on: Aug 17, 2025 | 8:59 PM

Share

బీడీ, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయని దాదాపు అందరికీ తెలిసిందే. అయినా చాలా మంది ఈ అలవాట్లను అంత సులువుగా వదులుకోలేరు. ధూమపానం ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. ధూమపానం, పొగాకు వినియోగం మాత్రమే కాదు అనేక ఇతర అంశాలు ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతాయన్న విషయం మీకు తెలుసా? అవును.. ఆహారంలో అధిక ఉప్పు శాతం, కాలుష్యం వంటి అంశాలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఊపిరితిత్తులకు హాని కలిగించే కారకాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఊపిరితిత్తులకు నష్టం కలిగించే అంశాలు ఇవే..

కాలుష్యం

కలుషితమైన గాలికి నిరంతరం గురికావడం వల్ల ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. 2.5 ppm కంటే ఎక్కువ కాలుష్య స్థాయిలు ఉన్న నగరాల్లో నివసించే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

దుమ్ము ధూళి

అధిక దుమ్ము ధూళి ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. దుమ్ము ధూళికి నిరంతరం గురికావడం వల్ల ఊపిరితిత్తుల కణజాలంలో దుమ్ము కణాలు పేరుకుపోతాయి. ఇది వాయుమార్గాలను దెబ్బతీస్తుంది. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్‌ ధరించడం మంచిది.

ఇవి కూడా చదవండి

రసాయనాలు

విష వాయువులు, క్లోరిన్, డీజిల్ పొగలు, బెంజీన్ పొగలకు నిరంతరం గురికావడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. ఇవి ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తాయి.

పేలవమైన జీవనశైలి

నాణ్యత లేని ఆహారం, వ్యాయామం లేకపోవడం, క్షయ, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఊపిరితిత్తుల అనారోగ్యానికి దోహదం చేస్తాయి. వీటివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

జన్యుపరమైన కారకాలు

కొంతమందికి వారసత్వంగా ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. ఈ అంశాల వల్ల ధూమపానం చేయకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధిలో అనువంశికత అంటే కుటుంబంలో ఎవరికైనా ఇంటే వారి వంశంలోని ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

సోడియం అధికంగా ఉండే ఆహారాలు

సోడియం అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అవును.. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజుకు 2300 మి.గ్రా కంటే ఎక్కువ సోడియం తీసుకోవడం మానుకోవాలి.

బీడీ, సిగరెట్ పొగ

మీరు ధూమపానం చేయకపోయినా మీ చుట్టూ ఉన్న ఎవరైనా ధూమపానం చేసినా ఆ పొగ మీ శరీరంలోకి ప్రవేశిస్తే మీ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us