AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మైదానంలో స్టీవ్ స్మిత్ రుద్రరూపం.. కోపంలో ఏం చేశాడో తెలుసా..?

Steve Smith PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్‌లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అత్యంత కీలకమైన మ్యాచ్‌లో తక్కువ పరుగులకే వెనుదిరగడంతో తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు. డ్రెస్సింగ్ గదికి వెళ్లే క్రమంలో తన బ్యాట్‌ను నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. ఈ అనూహ్య ప్రవర్తన ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారింది.

Video: మైదానంలో స్టీవ్ స్మిత్ రుద్రరూపం.. కోపంలో ఏం చేశాడో తెలుసా..?
Steve Smith In Full Angry Mode
Venkata Chari
|

Updated on: Apr 29, 2026 | 9:31 PM

Share

Steve Smith PSL 2026: హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. వారం రోజుల క్రితమే ఇదే జట్టుపై కేవలం 50 బంతుల్లో 106 పరుగులు చేసిన స్మిత్, నేటి కీలక మ్యాచ్‌లో మాత్రం తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. జట్టును గెలిపించాలనే పట్టుదలతో ఉన్న స్మిత్, కీలక సమయంలో వికెట్ సమర్పించుకోవడంతో తనపై తానే అసహనం వ్యక్తం చేశాడు.

మైదానంలో అసలేం జరిగింది?

టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మహమ్మద్ అలీ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు స్మిత్ ప్రయత్నించాడు. అయితే, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మాజ్ సదాకత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందే ఒక క్యాచ్ డ్రాప్ వల్ల ప్రాణదానం పొందినప్పటికీ, స్మిత్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అవుటైన తర్వాత డ్రెస్సింగ్ గదికి వెళ్తుండగా, కెమెరా కంటికి స్మిత్ ఆగ్రహం చిక్కింది. ఆయన తన బ్యాట్‌ను బలంగా నేలకేసి బాదడం స్పష్టంగా కనిపించింది.

ఒలింపిక్ లక్ష్యం..

2028 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనాలనే బలమైన ఆకాంక్షతో ఉన్న స్మిత్, ప్రస్తుతం పొట్టి క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించారు. ఈ సీజన్‌లో ఆయన ముల్తాన్ సుల్తాన్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 161.70 స్ట్రైక్ రేట్‌తో 380 పరుగులు సాధించి, తన జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ, కీలకమైన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో విఫలం కావడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది.

ముగిసిన ముల్తాన్ సుల్తాన్స్ ప్రయాణం?

లీగ్ దశలో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ముల్తాన్ సుల్తాన్స్, సెకండ్ హాఫ్ లో తడబడింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. స్మిత్ అవుటైన తర్వాత ముల్తాన్ జట్టు కుప్పకూలింది. 12 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి కేవలం 86 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ముల్తాన్ సుల్తాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. మరోవైపు మార్నస్ లబుషేన్ నేతృత్వంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్ తదుపరి దశకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us