Liver: ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే మీ లివర్ జాగ్రత్త..

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం దెబ్బతింటుంది.

Liver: ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే మీ లివర్ జాగ్రత్త..
Follow us

|

Updated on: Mar 13, 2022 | 2:14 PM

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం (Liver) దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్దీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు (Foods) తీసుకోవాలి అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు (Liver Disease) చుట్టు ముడతాయి. కొన్ని సార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. వీటన్నింటిని ట్రీట్‌మెంట్‌తో సరిచేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జనానికి జంక్ ఫుడ్స్ తినడం అలవాటైంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం కూడా వస్తుంది. దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. సోడా, ఇతర కార్బోనేటేడ్ పానీయాలు తీవ్రమైన కాలేయ సమస్యలను కలిగిస్తాయి. ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అదే సమయంలో ఈ కార్బోనేటేడ్ పానీయాలు కూడా ఊబకాయం సమస్యకు దోహదం చేస్తాయి. చక్కెర నూనె, పిండి వంటి శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా కాలేయానికి హానికరం. ఈ పదార్థాలు శరీరంలో క్యాన్సర్ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. కనుక ఇలాంటి పదార్థాలకు దూరంగా వుండాలి.

ద్రాక్షలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్‌ని రక్షిస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోండి. మీ కాలేయం బాగుంటుంది. వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. ఘాటైన వెల్లుల్లిలో కొలెస్టిరాల్‌ని తగ్గిస్తుంది. దీనిని తినడం వల్ల క్యాన్సర్ నిరోధిస్తుంది. దీనిని తినడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది , కాలేయ ఆరోగ్యానికి, కీళ్లనొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది.

బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంపల్లో కాలేయ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రతీరోజూ వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది. ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి, సోడియం, పొటాషియం తక్కువగా ఉండే ఆపిల్స్‌ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క, లోపలి గుజ్జులోనూ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది.

గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.

Read also.. Birth Control Pills side effects: గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..