AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs: మీరు కోడి గుడ్లను అలా తింటున్నారా.. అయితే మీరు నష్టపోయినట్లే..

గుడ్లు(Eggs) ప్రోటీన్ల నిధి అని చెబుతారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అల్పాహారంలో గుడ్లు తినడానికి చాలా ఇష్టపడతారు. గుడ్లను రకరకాలుగా వండుతారు...

Eggs: మీరు కోడి గుడ్లను అలా తింటున్నారా.. అయితే మీరు నష్టపోయినట్లే..
ఉడకబెట్టిన గుడ్డు: మీరు నాన్-వెజ్‌ని ఇష్టపడితే.. ఉడికించిన గుడ్డు కూడా చాలా మంచిది. ఉడికించిన గుడ్లు ఆకలిని శాంతపరుస్తాయి. అందులో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి.
Srinivas Chekkilla
|

Updated on: Mar 13, 2022 | 2:54 PM

Share

గుడ్లు(Eggs) ప్రోటీన్ల నిధి అని చెబుతారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అల్పాహారంలో గుడ్లు తినడానికి చాలా ఇష్టపడతారు. గుడ్లను రకరకాలుగా వండుతారు. కొందరు ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ఇష్టపడతారు. మరికొంత మంది ఎగ్ పుడ్డింగ్ చేసి తింటారు. కొంతమంది బ్రెడ్‌తో ఆమ్లెట్(Bred amlet) తినడానికి ఇష్టపడతారు. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పోషకాహార నిపుణులు చెబుతున్నప్పటికీ, మీరు దానిని ఏ పద్ధతిలో తింటున్నారో కూడా ముఖ్యమని చెప్పారు. గుడ్డులోని చాలా పోషకాలు దాని పచ్చసొనలో అంటే పసుపు భాగంలో ఉంటాయి. గుడ్డు మొత్తం అంటే దానిలోని తెల్లటి పొర, పసుపు భాగాన్ని కలిపి తినడం ద్వారా శరీరానికి సరైన ప్రొటీన్, స్ప్రెడ్, క్యాలరీలు అందుతాయి. ఈ కాంబినేషన్‌లో గుడ్లు తినడం వల్ల చాలా మందికి కడుపు నిండుగా ఉంటుంది.

గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. మరే ఇతర ఆహారంలో లేని అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక గుడ్డులో విటమిన్ ఎ – 6 శాతం, విటమిన్ బి5 – 7 శాతం, విటమిన్ బి12 – 9 శాతం, ఫాస్పరస్ – 9 శాతం, విటమిన్ బి2 – 15 శాతం , సెలీనియం 22 శాతం ఉంటాయి. అందువల్ల, గుడ్డు తినేసమయంలో దాని పసుపు భాగం కూడా తినాలని నిపుణులు చెబుతారు.

గుడ్డు పచ్చసొనలో ఐరన్, రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏ డైట్ తీసుకోవాలనుకున్నా.. మీరు ఖచ్చితంగా ఒకసారి డైటీషియన్‌ సలహా తీసుకోవాలి. అలాగే క్యాలరీల విషయంలోనూ చాలామంది పచ్చసొనను తినడానికి ఇష్టపడరు. గుడ్డులో దాదాపు 72 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 55 కేలరీలు పచ్చసొనవి కాగా.. తెలుపు భాగంలో 17 క్యాలరీలు ఉంటాయి.

గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.

Read Also..  Liver: ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే మీ లివర్ జాగ్రత్త..