Lemon Side Effects: నిమ్మకాయలను మితంగా వాడండి.. లేదంటే ఈ ప్రమాదం మిమ్మల్ని వెంటాడొచ్చు..
Lemon Side Effects: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో వణికించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ దాని ప్రభావం తగ్గలేదు.
Lemon Side Effects: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో వణికించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ దాని ప్రభావం తగ్గలేదు. అయితే, కరోనా నుంచి సేఫ్‌గా బయటపడాలంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. అందుకోసం మంచి ఆహారం తీసుకోవడంతో పాటు.. రోగ నిరోధక శక్తిని పెంచే నిమ్మకాయల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సైతం నిమ్మకాలయను అధికంగా తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే, నిమ్మకాయ రసాన్ని అధికంగా తీసుకుంటే అసలుకే మోసం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలివే..
1. టాన్సిల్ సమస్య: అవసరమైన దానికంటే ఎక్కువ నిమ్మరసం తీసుకుంటే గొంతులో సమస్యకు కారణం అవుతుంది. ఎక్కువ పుల్లని పదార్థం తీసుకోవడం గొంతు నొప్పి, టాన్సిల్ సమస్య తలెత్తుతుంది.
2. దంతక్షయం: నిమ్మకాయలో ఆమ్ల లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది దంత క్షయానికి దారి తీస్తుంది. దంతాలపై ఉండే ఎనామిల్ నాశనం అవుతుంది.
3. జీర్ణ సమస్యలు: జిర్ణక్రియను మెరుగుపరచడానికి నిమ్మకాయను ఒక మార్గంగా భావిస్తారు. అయితే, అధికంగా నిమ్మరసం తాగితే అది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి వ్యాధులు వస్తాయి. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ పాడయ్యే ప్రమాదం ఉంది. వాంతులు అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..