AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leafy Vegetables: ప్రకృతి ఇచ్చిన వరం ఆకుకూరలు.. రోజూ ఏఏ ఆకుకూరలు తింటే.. ఏఏ ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Leafy Vegetables: ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకు కూరలు.. వీటిని తింటే శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజూ ఏదొక రకంగా ఆకుకూరలను..

Leafy Vegetables: ప్రకృతి ఇచ్చిన వరం ఆకుకూరలు.. రోజూ ఏఏ ఆకుకూరలు తింటే.. ఏఏ ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Leafy Vegetables
Surya Kala
|

Updated on: Oct 15, 2021 | 7:44 PM

Share

Leafy Vegetables: ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకు కూరలు.. వీటిని తింటే శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజూ ఏదొక రకంగా ఆకుకూరలను తింటే.. వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకు కూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకు కూరలు ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా.. సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

కరివేపాకు: సర్వసాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు ఉంటుంది. అయితే చాలామంది కూరల్లో కర్వేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మేరుపడడానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేసే నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు.  ఏ విధంగా ఆహారంలో చేర్చుకున్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. కొత్తిమీర: వంటలకు అదనపు రుచి , సువాసన అందించడానికి కొత్తిమీరను ఉపయోగిస్తారు. ఈ కొత్తిమీర ఆస్తమా సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తుంది.  రోజూ కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది.  జీర్ణ సమస్యలు ఉండవు.

పుదీనా: వంటలకు అదనపు రుచి, మంచి స్మెల్ ను ఇవ్వడానికి పుదీనాని కూడా ఉపయోగిస్తారు. అయితే ఈపుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యల, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పర్ మెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటారు.

తోటకూర: ఆకుకూరల్లో ప్రధానంగా కూరగా చేసుకుని తినేది తోటకూర. దీనిలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందుకనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ని నిరోధిస్తుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటారు. ,జీర్ణం ఈజీగా అవుతుందని.. త్వరగా కోలుకుంటారని రోగికి తోటకూరను తినే ఆహారంలో చేరుస్తారు.

గోంగూర: పుల్లటి రుచికలిగిన గొంగుర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి.

 బచ్చలికూర: శరీరం వేడి ఎక్కువగా ఉన్నవారికి బచ్చలికూరను మంచి మేలు చేస్తుంది. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది.  కనుక వేసవిలో తీసుకునే ఆకు కూరల్లో ఇది మొదటని చెప్పవచ్చు.

పాలకూర: ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు.

సునాముఖి: ఈ ఆకుని మలబద్ధకం ఉన్నవారు తింటే.. సమస్య నివారింపబడుతుంది. చారుగా చేసుకుని తింటే మలబద్దకం ఉండదు. గ్యాస్‌ సమస్య తగ్గుతుంది

Also Read:  క్రికెట్ గ్రౌండ్స్‌గా మారనున్న ఐనాక్స్ థియేటర్లు.. టీ 20 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రెడీ