T20 World Cup: క్రికెట్ గ్రౌండ్స్‌గా మారనున్న ఐనాక్స్ థియేటర్లు.. టీ 20 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రెడీ
T20 Cricket World Cup: ఐపీఎస్ ముగిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులకు మరో సందడి మొదలు కానుంది. మరికొన్ని రోజుల్లో పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం..
T20 Cricket World Cup: ఐపీఎస్ ముగిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులకు మరో సందడి మొదలు కానుంది. మరికొన్ని రోజుల్లో పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అవును మరికొన్ని రోజుల్లో టీ 20 వరల్డ్ కప్ స్టార్ కానుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ సమరానికి భారత్ వేదిక కావాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో పొట్టి ప్రపంచ కప్ మ్యాచ్ లను యూఏఈ, ఒమన్‌లలో నిర్వహించడానికి ఐసీసీ సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీ క్రికెట్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను ఐనాక్స్ థియేటర్లలో ప్రదర్శించడానికి యాజమాన్యం రెడీ అవుతుంది. ఈ మేరకు మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్ లేజర్ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబరు 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అయితే, ఈ మ్యాచ్ ల్లో భారత్ అదే మ్యాచ్ లను తమ ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శిస్తామని ఐనాక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఇలా మ్యాచ్ లను థియేటర్ లో పెద్ద పెద్ద స్క్రీన్ పై చూస్తే.. క్రికెట్ మైదానంలో మ్యాచులను చూస్తున్న అనుభూతి కలుగుతుందని ఐనాక్స్ సంస్థ చెబుతోంది. ఇక మ్యాచ్ చూడడానికి వచ్చిన వీక్షకులు.. స్నాక్స్ కోసం ఆర్డర్ ఇస్తారు కనుక.. ఇక ఆ విధంగా కూడా ఫుడ్ కోర్ట్ వ్యాపారం పుంజుకుంటుందని భావిస్తున్నారు. మ్యాచ్ వీక్షించడానికి టికెట్ ధర.. నగరాన్ని బట్టి ఒకొక్క విధంగా ఉండవచ్చునని.. రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని చెబుతున్నారు.ఇక ఐనాక్స్ కు దేశ వ్యాప్తంగా మొత్తం 70నగరాల్లో 56మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్‌లు ఐనాక్స్ నిర్వహణలో ఉన్నాయి.
Also Read: కేంద్ర మంత్రి పరామర్శించడం ఒకే.. ఫోటో తీయడంపై అభ్యంతరం చెప్పిన మన్మోహన్ సింగ్ కూతురు