T20 World Cup: భారత్‌తో భయపడకుండా ఆడండి.. పాక్ ఆటగాళ్లకు మియాందాద్ సూచన..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ అక్టోబర్ 24 న జరగబోయే భారత్, పాక్ మ్యాచ్‌పై మాట్లాడారు. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మ్యాచ్‌లో నిర్భయంగా ఆడడమే పాకిస్థాన్ విజయ అవకాశాలకు కీలకమని చెప్పారు...
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ అక్టోబర్ 24 న జరగబోయే భారత్, పాక్ మ్యాచ్‌పై మాట్లాడారు. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మ్యాచ్‌లో నిర్భయంగా ఆడడమే పాకిస్థాన్ విజయ అవకాశాలకు కీలకమని చెప్పారు. భారత్.. వన్డే ప్రపంచకప్‌లో గానీ, టీ20 ప్రపంచకప్‌లోనూ గానీ ఎప్పుడూ పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదని చెప్పారు. పాక్ టోర్నమెంట్లో జోరందుకోవడానికి భారత్‌తో మ్యాచ్ కీలకమన్నారు. భారత్ బలమైన జట్టు అని అందులో అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారన తెలిపారు. ” కానీ మనం భయం, ఒత్తిడి లేకుండా ఆడితే ఇండియాను ఓడించగలం” అని ఆయన అన్నారు. ఈవెంట్‌లో పాకిస్థాన్ జట్టు బాగా రాణించగల సామర్థ్యం ఉందని మియాందాద్ అభిప్రాయపడ్డారు.
టీ 20 ఫార్మాట్ అంటే ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు బాగా అడితే మ్యాచ్ గెలవచ్చని అనుకుంటారని.. కానీ అది సరైంది కాదన్నారు. పాకిస్తాన్ కేవలం కెప్టెన్ అజమ్‌పై ఆధారపడొద్దని అన్నారు. “టీ 20 ఫార్మాట్‌లో చిన్న ఇన్నింగ్స్ లేదా కీలకమైన క్యాచ్ లేదా రనౌట్ లేదా మంచి ఓవర్ మీ మ్యాచులను గెలిస్తాయని చెప్పారు. టీ20 క్రికెట్టంటే సిక్స్‌లు, ఫోర్లు కొట్టడమే కాదని చెప్పాడు. ఎప్పుడూ బాదడం కోసమే ప్రయత్నించొద్దు. సరైన సమయం చూసి ప్రణాళికలను అమలు చేయాలని మియాందాద్ అన్నాడు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ భారత్‌ను ఓడిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. గత మూడు-నాలుగు సంవత్సరాలుగా యూఏఈలో ఎక్కువగా ఆడినందున తమకు అవకాశం ఉందన్నారు. “వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో, బ్యాటర్‌లు సర్దుబాట్లు ఎలా చేయాలో మాకు తెలుసు” అని అన్నారు.