IPL 2021 Final Highlights, CSK vs KKR: ఫైనల్లో చిత్తయిన కోల్‌కతా.. ఎల్లో ఆర్మీదే ఐపీఎల్ 2021 ట్రోఫీ

Venkata Chari

|

Updated on: Oct 15, 2021 | 11:43 PM

CSK vs KKR: మొదటి నుంచి అద్భుతంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

IPL 2021 Final Highlights, CSK vs KKR: ఫైనల్లో చిత్తయిన కోల్‌కతా.. ఎల్లో ఆర్మీదే ఐపీఎల్ 2021 ట్రోఫీ
Ipl 2021 Final, Csk Vs Kkr

IPL 2021 Final Highlights, CSK vs KKR: కీలకమైన ఫైనల్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ తడబడింది. మొదటి నుంచి అద్భుతంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. భారీ స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ టీం ఆరంభం అదిరినా.. తొలి వికెట్ అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేయగలిగింది. ఐపీఎల్ 2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించి, టీం భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ (32 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్(86 పరుగులు, 59 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సులు), మొయిన్ అలీ(37 పరగులు, 20 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సులు) , రాబిన్ ఊతప్ప(31 పరుగులు, 15 బంతులు, 3 సిక్స్‌లు) రాణించడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికట్లు, శివం మావీ ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు.

శుక్రవారం జరిగే ఐపీఎల్ 2021 టైటిల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తలపడుతుంది. ప్లేఆఫ్స్‌లో కోల్‌కతా మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తర్వాత క్వాలిఫయర్ -2 లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా ఓడించింది. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ మొదటి క్వాలిఫయర్‌లో ఢిల్లీని ఓడించి ఫైనల్ చేరింది.

ఐపీఎల్‌లో రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 17, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి. యూఏఈలో జరిగిన 3 మ్యాచ్‌లలో చెన్నై 2, కేకేఆర్ 1 గెలిచింది. ఫైనల్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై గెలిచిన ఈ మైదానంలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే ముఖాముఖిగా తలపడ్డాయి.

లీగ్ రౌండ్‌లో రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. అయితే కేకేఆర్ రెండు సార్లు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. షేక్ జాయెద్ స్టేడియంలో సెప్టెంబర్ 26 న జరిగిన మ్యాచ్‌లో, చెన్నై రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి దశలో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్లేయింగ్ ఎలెవన్: కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (కీపర్), ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 15 Oct 2021 11:41 PM (IST)

    ఐపీఎల్ 2021 ట్రోఫీ చెన్నైదే

    మొదటి నుంచి అద్భుతంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

  • 15 Oct 2021 10:57 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    షకిబుల్ హసన్ (0) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

  • 15 Oct 2021 10:54 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    దినేష్ కార్తీక్ (9 పరుగులు) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అంబటి రాయుడుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 15 Oct 2021 10:46 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    శుభ్మన్ గిల్ (51 పరుగులు, 43 బంతులు, 6ఫోర్లు) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. చాహర్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

  • 15 Oct 2021 10:43 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన గిల్

    శుభ్మన్ గిల్ కేవలం 40 బంతుల్లో 6 ఫోర్లతో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.

  • 15 Oct 2021 10:36 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    సునీల్ నరైన్ (2) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. హజల్‌వుడ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 15 Oct 2021 10:33 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    నితీష్ రానా (0) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. శార్దుల్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కోల్‌కతాను దెబ్బ తీశాడు.

  • 15 Oct 2021 10:30 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    వెంకటేష్ అయ్యర్ (50 పరుగులు, 32 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. శార్దుల్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 91 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.

  • 15 Oct 2021 10:23 PM (IST)

    ఔట్‌ నుంచి తప్పించుకున్న గిల్

    శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్‌ 9.3 ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భారీ షాట్ ఆడిన గిల్.. ఆ బాల్ కెమెరా తీగకు తాకడంతో ఆ బాల్‌ను డెడ్ బాల్‌గా ప్రకటించారు. దీంతో కోల్‌కతా టీంకు బిగ్ రిలీఫ్ దొరికింది.

  • 15 Oct 2021 10:20 PM (IST)

    వెంకటేష్ అయ్యర్ అర్థ సెంచరీ

    కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ కీలకమైన ఫైనల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. కేవలం 31 బంతులో 50 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

  • 15 Oct 2021 10:17 PM (IST)

    9 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 72/0

    9 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 72 పరుగులు సాధించింది. క్రీజులో శుభ్మన్ గిల్ 27, వెంకటేష్ అయ్యర్ 43 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి 66 బంతుల్లో 121 పరుగులు కావాల్సి ఉంది.

  • 15 Oct 2021 10:02 PM (IST)

    6 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 55/0

    6 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 55 పరుగులు సాధించింది. క్రీజులో శుభ్మన్ గిల్ 22, వెంకటేష్ అయ్యర్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి 84 బంతుల్లో 138 పరుగులు కావాల్సి ఉంది.

  • 15 Oct 2021 09:46 PM (IST)

    3 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 24/0

    3 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 24 పరుగులు సాధించింది. క్రీజులో శుభ్మన్ గిల్ 8, వెంకటేష్ అయ్యర్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి మరో 169 పరుగులు కావాల్సి ఉంది.

  • 15 Oct 2021 09:40 PM (IST)

    వెంకటేష్ అయ్యర్ తొలి సిక్స్

    కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హజల్‌వుడ్ బౌలింగ్‌లో తొలి సిక్స్‌ బాదేశాడు. అయితే అంతకు ముందు బాల్‌కే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

  • 15 Oct 2021 09:32 PM (IST)

    కోల్‌కతా టార్గెట్ 193 పరుగులు

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

  • 15 Oct 2021 09:09 PM (IST)

    19 ఓవర్లకు చెన్నై స్కోర్ 185/2

    19 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 185 పరుగులు సాధించింది. క్రీజులో డుప్లెసిస్ 81(55 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సులు), అలీ 35(18 బంతులు, 2 ఫోర్, 3 సిక్సులు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 09:04 PM (IST)

    18 ఓవర్లకు చెన్నై స్కోర్ 172/2

    18 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 172 పరుగులు సాధించింది. క్రీజులో డుప్లెసిస్ 80(54 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సులు), అలీ 23(13 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 08:58 PM (IST)

    17 ఓవర్లకు చెన్నై స్కోర్ 153/2

    17 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 153 పరుగులు సాధించింది. క్రీజులో డుప్లెసిస్ 69, అలీ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 08:46 PM (IST)

    15 ఓవర్లకు చెన్నై స్కోర్ 131/2

    15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 131 పరుగులు సాధించింది. క్రీజులో డుప్లెసిస్ 61, అలీ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 08:39 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన చెన్నై

    ఊతప్ప (31 పరుగులు, 15 బంతులు, 3 సిక్స్‌లు) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే రాబిన్ ఊతప్ప 206 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఔట్ అయ్యాడు.

  • 15 Oct 2021 08:29 PM (IST)

    12 ఓవర్లకు చెన్నై స్కోర్ 104/1

    12 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం ఒక వికెట్ నష్టపోయి 104 పరుగులు సాధించింది. క్రీజులో డుప్లెసిస్ 55, ఊతప్ప 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 08:16 PM (IST)

    9 ఓవర్లకు చెన్నై స్కోర్ 65/1

    9 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం ఒక వికెట్ నష్టపోయి 65 పరుగులు సాధించింది. క్రీజులో డుప్లెసిస్ 29, ఊతప్ప 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 08:14 PM (IST)

    ఓ సీజన్‌లో అత్యధిక పరుగుల సాధించిన భాగస్వామ్యాలు

    939 కోహ్లి –  డివిలియర్స్ (2016) 791 డి వార్నర్ – జె బెయిర్‌స్టో (2019) 756 ఆర్ గైక్వాడ్ – ఫాఫ్ డు ప్లెసిస్ (2021) * 744 ఎస్ ధావన్ – పి షా (2021) 731 ఎస్ ధావన్ – డి వార్నర్ (2016)

  • 15 Oct 2021 08:12 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

    రుతురాజ్ (32 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 15 Oct 2021 07:59 PM (IST)

    6 ఓవర్లకు చెన్నై స్కోర్ 50/0

    6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం 50 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 26, డుప్లెసిస్ 22 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 07:51 PM (IST)

    ఆరెంజ్ క్యాప్ లిస్టులో రుతురాజ్ అగ్రస్థానం

    ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ (626) పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. నేటి మ్యాచులో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ 3. 4 ఓవర్లో సింగిల్‌ తీసి 626 పరుగులను దాటేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌ రుతురాజ్ సొంతం కానుంది.

  • 15 Oct 2021 07:46 PM (IST)

    రుతురాజ్ తొలి సిక్స్

    చెన్నై ఓపెనర్ రుతురాజ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో షకీబ్‌ను టార్గెట్ చేసుకుని బౌండరీలు సాధిస్తున్నాడు. ఈ ఓవర్లోనే తొలి సిక్స్ బాదేశాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం వికెట్ నష్టపోకుండా 22 పరుగులు సాధించింది. క్రీజులో రుతురాజ్ 18, డుప్లెసిస్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 15 Oct 2021 07:34 PM (IST)

    రుతురాజ్ తొలి బౌండరీ

    ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతినే రుతురాజ్ తొలి బౌండరీగా తరలించాడు. షకిబుల్ హసన్‌ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 6 పరుగులు వచ్చాయి.

  • 15 Oct 2021 07:32 PM (IST)

    మొదలైన చెన్నై ‘ఫైనల్’ బ్యాటింగ్

    ఐపీఎల్ 2021లో చెన్నై టీం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లుగా రుతురాజ్, డుప్లెసిస్ బరిలోకి దిగారు.

  • 15 Oct 2021 07:07 PM (IST)

    సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (కీపర్), ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

  • 15 Oct 2021 07:05 PM (IST)

    టాస్ గెలిచిన మోర్గాన్ సేన

    ఐపీఎల్ 2021 ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.

  • 15 Oct 2021 06:47 PM (IST)

    IPL 2021 Final, CSK vs KKR: ట్రోఫీలో పైచేయి

    ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2018) ఐపీఎల్ ట్రోఫీని మూడు సార్లు గెలిచింది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ టీం (2012, 2014) రెండు సార్లు ట్రోఫీని సాధిచింది.

  • 15 Oct 2021 06:40 PM (IST)

    IPL 2021 Final: సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్ – హెడ్ టూ హెడ్

    ఐపీఎల్‌లో రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 17, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి. యూఏఈలో జరిగిన 3 మ్యాచ్‌లలో చెన్నై 2, కేకేఆర్ 1 గెలిచింది. ఫైనల్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై గెలిచిన ఈ మైదానంలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే ముఖాముఖిగా తలపడ్డాయి.

  • 15 Oct 2021 06:39 PM (IST)

    CSK vs KKR: ఫైనల్ పోరుకు అంతా సిద్ధం

Published On - Oct 15,2021 6:32 PM

Follow us