IPL 2021 Final, CSK vs KKR: అభిమానులకు షాకిచ్చిన డేవిడ్ వార్నర్.. చెన్నై జెర్సీతో నెట్టింట్లో హల్‌చల్.. అసలు విషయం ఏంటంటే?

David Warner: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో డేవిడ్ వార్నర్‌ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో కనిపించడం విశేషం.

IPL 2021 Final, CSK vs KKR: అభిమానులకు షాకిచ్చిన డేవిడ్ వార్నర్.. చెన్నై జెర్సీతో నెట్టింట్లో హల్‌చల్.. అసలు విషయం ఏంటంటే?
Ipl 2021 Final, Csk Vs Kkr David Warner
Follow us
Venkata Chari

|

Updated on: Oct 15, 2021 | 6:13 PM

IPL 2021 Final, CSK vs KKR: ఐపీఎల్ 2021లో నేడు కీలక పోరు అంటే ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీంలు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. మరికొద్దిసేపట్లో తుది పోరు మొదలుకానుంది. అయితే ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో డేవిడ్ వార్నర్‌ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో కనిపించడం విశేషం. అలాగే తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని అభిమానులకు షాకిచ్చాడు. సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్‌ టీంల మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ సందర్బంగా ఇలా కనిపించడంతో హైదరాబాద్ అభిమానులకు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఫొటోకు ‘ ఫైనల్‌లో ఏ టీం గెలుస్తుందో చెప్పలేను. కానీ, ఓ ఫ్యాన్ కోరికపై ఇలా కనిపిస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ అందించాడు.

అయితే, ఈ ఫొటో షేర్ చేసిన కొద్ది సేపటికే ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ దీన్ని తొలగించాడు. దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే సీజన్‌లో వార్నర్‌ సీఎస్‌కే టీంలో చేరనున్నాడా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు బుద్ది చెప్పాటలనే ఇలా చేశాడంటూ మరికొంతమంది కామెంట్లు చేశారు.

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో వార్నర్ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడ్డాడు. దీంతో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ నుంచే కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. వార్నర్ స్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ఎస్‌ఆర్‌హెచ్ సారథ్య బాధ్యతలు చూస్తున్నాడు.

Also Read: IPL 2021 Final, CSK vs KKR: చరిత్ర సృష్టించనున్న ధోనీ.. ట్రిపుల్ సెంచరీతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో..!

IPL 2021 Final: ధోనీ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన గౌతమ్ గంభీర్.. ఇలా అంటాడని ఎవ్వరూ ఊహించలే..!

IPL 2021 FInal, CSK vs KKR: కింగ్‌ ఖాన్‌ను వదలని సన్ స్ట్రోక్.. ఫైనల్‌కు దూరం.. ఆయన కోసం ట్రోఫీ గెలుస్తామంటోన్న ఆటగాళ్లు