AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Care: రోజూ ఈ పదార్థాల తింటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందట.. అవెంటో తెలుసుకోండి..

ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. కరోనాను నియంత్రించేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి

Kidney Care: రోజూ ఈ పదార్థాల తింటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందట.. అవెంటో తెలుసుకోండి..
Kidney
Rajitha Chanti
| Edited By: Phani CH|

Updated on: Jan 17, 2022 | 1:36 PM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. కరోనాను నియంత్రించేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లో చేసిన వంటకాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా.. ఫిట్ నెస్ కాపాడుకోవడానికి రోజూ వ్యాయమాలు చేయడం.. అందుకు తగిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే మనం రోజూ అధిక మోతాదులో తీసుకునే ఆహార పదార్థాలు కొన్ని సందర్బాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. అందులోనూ కొన్ని ఆహార పదార్థాలను రోజూ తీసుకోవడం వలన కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు అవెంటో తెలుసుకుందామా.

అతిగా మద్యం సేవించడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల పనితీరులో సమస్యలను కలిగిస్తోంది. అలాగే మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే కాఫీలో ఎక్కువగా కెఫీన్ ఉంటుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వలన కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని తెలీంది. అంతేకాకుండా.. కాఫీ ఎక్కువగా తాగేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.

మాంసంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు ముఖ్యం. కానీ మూత్రపిండాలపై అధిక ఒత్తిడి కలిగిస్తోంది. అంతేకాకుండా.. మాంసం ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. సాస్, కుకీలు ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే వారు కిడ్నీ వ్యాధులు కలిగించే వ్యాధులకు దూరంగా ఉండాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read:

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..