Kidney Health Tips: కిడ్నీల్లోని వ్యర్ధాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజు ఒక్కసారైనా ఈ ఔషధాన్ని తాగండి..

Kidney Health Tips: మ‌న శరీరంలో అత్యంత ముఖ్యమైన అవ‌య‌వం కిడ్నీలు. రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. ర‌క్తాన్ని శుద్ధి..

Kidney Health Tips: కిడ్నీల్లోని వ్యర్ధాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజు ఒక్కసారైనా ఈ ఔషధాన్ని తాగండి..
Kidney Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2021 | 9:50 PM

Kidney Health Tips: మ‌న శరీరంలో అత్యంత ముఖ్యమైన అవ‌య‌వం కిడ్నీలు. రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషిస్తాయి. వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుండటంతో వాటిల్లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. కిడ్నీల ప‌నితీరు బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. లేక‌పోతే అవ‌య‌వాలు ప‌నితీరు దెబ్బతిని.. అనారోగ్యాల‌కు గుర‌వుతుంటాం. అందుకే మూత్ర పిండాల‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలి కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబ‌ట్టి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కిడ్నీల ప‌నితీరు బాగుండాలంటే.. వ్యర్థాలు, విష పదార్థాలను రోజూ బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీలను శుభ్రం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆహారంతోనే కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు. ఈ రోజు కిడ్నీలను శుభ్రంచేసే దివ్య ఔషధం తయారీ గురించి తెలుసుకుందాం..

కావల్సిన పదార్ధాలు:

కొత్తిమీర/ కర్వేపాకు నీరు నిమ్మరసం తేనె

తయారీ విధానం: ముందుగా కొత్తిమీర కట్ట తీసుకుని శుభ్రం చేసుకుని .. తర్వాత ఆకులను సన్నగా తరగాలి. ఇప్పుడు స్టౌ మీద ఒక గిన్నె పెట్టి.. అందులో గ్లాస్‌ నీటిని వేసి.. ఆ నీటిని మరిగించాలి. మరుగుతున్న నీటిలో శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఆకులను వేసి.. మరో కొంచెం సేపు ఆనీటిని మరిగించాలి. అనంతరం ఆ నీటిని చల్లార్చాలి. బాగా చల్లారిన తర్వాత ఆ నీటిని ఒక గాజు గ్లాసులోకి వడకట్టు కోవాలి. ఇప్పుడు..ఆ కొత్తిమీర నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా ఈ కొత్తిమీర ఔషధాన్ని రోజుకు ఒక ఒకసారి తాగాలి. ఈ ఔషధాన్ని తాగడానికి నిర్ధీన సమయం అంటూ లేదు. ఎప్పుడైనా తాగవచ్చు. దీని వల్ల కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోయి కిడ్నీలు శుభ్రమవుతాయి. కొత్తిమీర ఇష్టం లేనివారు.. కొత్తిమీర బదులుగా కరివేపాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇవి కూడా కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పంపి మూత్రపిండాలను సంరక్షిస్తాయి.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ తగినంత నీటిని తాగాలి. నిమ్మజాతికి చెందిన లేదా విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే పాలకూర, టమాటా వంటి ఆహారాలను వీలైనంత మేర తక్కువగా తీసుకోవాలి.

Also Read: ఆదివారం వ్యాక్సిన్ వేయించుకుంటే లక్కీ డ్రా.. వాషింగ్ మెషీన్స్, గ్రైండర్లు బహుమతి.. ఎక్కడంటే

మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..