Food Stuck in Throat: గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి.. అసలిలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

ఇడ్లీ తిని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇటీవల కేరళలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఫుడ్‌ కాంపిటీసన్‌లో ఓ వ్యక్తి చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఇడ్లీలు తినడానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో ఆ వ్యక్తి ఛాతీలో ఇడ్లీ ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి.. క్షణాల్లో మృతి చెందాడు. మోతాదుకు మించి, అతి వేగంగా తింటే మరణం ఎలా సంభవిస్తుందో సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ డాక్టర్‌ జుగల్ కిషోర్ మాట్లాడుతూ..

Food Stuck in Throat: గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి.. అసలిలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
Food Stuck In Throat
Follow us

|

Updated on: Sep 20, 2024 | 1:33 PM

ఇడ్లీ తిని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇటీవల కేరళలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఫుడ్‌ కాంపిటీసన్‌లో ఓ వ్యక్తి చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఇడ్లీలు తినడానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో ఆ వ్యక్తి ఛాతీలో ఇడ్లీ ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి.. క్షణాల్లో మృతి చెందాడు. మోతాదుకు మించి, అతి వేగంగా తింటే మరణం ఎలా సంభవిస్తుందో సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ డాక్టర్‌ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. ఓకేసారి ఎక్కువ ఆహారం తినడం ప్రాణాంతకం. తక్కువ సమయంలో అధిక ఆహారం వేగంగా తిన్నప్పుడు లేదా తినే సమయంలో మాట్లాడితే, ఆహారం శ్వాసనాళంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆహారాన్ని మింగినప్పుడు, ఈ సమయంలో శ్వాసనాళం తనంతట తానుగా మూసుకుపోతుంది. ఆహారం శ్వాసనాళానికి వెళ్లదు. అప్పుడు అది ఆహార గొట్టం ద్వారా కడుపులోకి వెళుతుంది. కానీ ఒక వ్యక్తి ఆహారం వేగంగా తినేటప్పుడు కొన్ని సందర్భాల్లో శ్వాసనాళం మూసుకుపోయే అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఆహారం ఈ ట్యూబ్‌లో (విండ్‌పైప్) ఇరుక్కుపోతుంది.

ఆహారం శ్వాసనాళంలో చిక్కుకున్నప్పుడు మరణం ఎలా సంభవిస్తుంది?

మనం తినే ఆహారం శ్వాసనాళాల్లో చిక్కుకున్నప్పుడు అది శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో ఆహారం నిలిచిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒకటి నుంచి రెండు నిమిషాలు శ్వాస తీసుకోకపోతే, శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అంతకు మించి ఆలస్యమైతే ఊపిరాడక పోవడం సంభవించి ఆ వ్యక్తి చనిపోవచ్చు. వైద్య పరిభాషలో దీనిని ఆస్పిరేట్ అంటారు. ఆహారం సాధారణంగా శ్వాసనాళంలో ఇరుక్కుపోదు. కానీ కొన్ని సెకన్ల వ్యవధిలో ఎక్కువ ఆహారాన్ని తింటే మాత్రం ఇది జరుగుతుందని డాక్టర్ కిషోర్ చెబుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో స్పీడ్ ఇంటింగ్ అంటారు. ఇలా తినడం ప్రమాదకరం. ఆహారం శ్వాసనాళంలో కూరుకుపోయి బయటకు రాలేకపోతే మరణం సంభవిస్తుంది. ఇటువంటి సంఘటనలు సాధారణంగా చాలా వేగంగా తినడం, తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడటం, నవ్వడం వలన సంభవిస్తాయి. ఈ సమస్య చిన్న పిల్లలలో కూడా కనిపిస్తుంది.

శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కుపోతే ఏం చేయాలి?

శ్వాసనాళంలో ఆహారం కూరుకుపోయినట్లయితే, ఆ వ్యక్తికి ముందుగా కొద్దిగా ఎక్కిళ్లు వచ్చి, ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆహారం ఇరుక్కుపోయి, అకస్మాత్తుగా ఎక్కిళ్ళు వచ్చినట్లయితే.. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే కనీసం 2 గ్లాసుల నీరు త్రాగించాలి. అలాగే చేతితో వీపు వెనుక భాగంలో తట్టాలి. ఇలా చేస్తే శ్వాసనాళంలో చిక్కుకున్న ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. లేదా బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి తాగించినా ప్రయోజనం ఉంటుంది. అనంతరం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా పిల్లలకు లేదా వృద్ధులకు ఇలా జరిగితే వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.