Health: భోజనం చేసిన తరువాత బెల్లంతో ఇలా చేయండి.. అద్భుతమైన ఫలితం చూస్తారు..!
బెల్లం అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లలు మొదలు.. పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బెల్లంను ఇష్టంగా తింటారు. ఇప్పుడంటే.. దాని ప్రాధాన్యత తగ్గింది కానీ, మునుపటి తరాల వారు వారు బెల్లం తినడంతో తమ రోజును ప్రారంభించేవారు. బెల్లం, నీళ్లు తప్పకుండా తాగేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. చెరుకుతో బెల్లంను
బెల్లం అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లలు మొదలు.. పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బెల్లంను ఇష్టంగా తింటారు. ఇప్పుడంటే.. దాని ప్రాధాన్యత తగ్గింది కానీ, మునుపటి తరాల వారు వారు బెల్లం తినడంతో తమ రోజును ప్రారంభించేవారు. బెల్లం, నీళ్లు తప్పకుండా తాగేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. చెరుకుతో బెల్లంను తయారు చేస్తారనే విషయం తెలిసిందే. సహజ సిద్ధమైన ఈ బెల్లంతో బోలుడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బెల్లంలో ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది ఆహారం తిన్న తరువాత ఖచ్చితంగా బెల్లం తింటారు. బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అందుకే ఆహారం తీసుకున్న తరువాత బెల్లం తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. అలాగని అధికంగా తీసుకోవద్దు. పరిమితంగానే బెల్లం తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మరి ఆహారం తిన్న తరువాత బెల్లం తింటే ఏమవుతుంది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది: శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలనుకుంటే, రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే.. భోజనం తర్వాత ఖచ్చితంగా బెల్లం తినడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు.
2. బరువు తగ్గడంలో: బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ తగిన మోతాదులో బెల్లం తినవచ్చు. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఫలితంగా బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
3. జీర్ణవ్యవస్థ బలోపేతం: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ బెల్లం తినాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్, అజీర్తి, వికారం వంటి సమస్యలు తొలగిపోతాయి.
4. రక్తపోటు నియంత్రణ: రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఆహారం తిన్న తరువాత బెల్లం తినడం ప్రారంభించాలి. బెల్లం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
5. ఎముకలు దృఢంగా: బెల్లం తినడం వల్ల శరీరంలోని ఎముకలు దృఢంగా మారుతాయి. కాల్షియం, ఫాస్పరస్, బెల్లం వంటి పోషకాలు ఉండటం వల్ల ఎముకలకు మంచి జరుగుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..