Children Health: హాయిగా నిద్ర పోతున్న పిల్లవాడు అకస్మాత్తుగా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ ఏడుస్తున్నాడా? ఎందుకలా..తెలుసా?
నిద్రపోతున్న పిల్లవాడు అకస్మాత్తుగా శబ్దాలు చేయడం, ఏడుపు లేదా చేతులు .. కాళ్ళు కదిలించడం ప్రారంభిస్తే, అప్పుడు ఏ తల్లిదండ్రుల హృదయం అయినా వణుకుతుంది.
Children Health: నిద్రపోతున్న పిల్లవాడు అకస్మాత్తుగా శబ్దాలు చేయడం, ఏడుపు లేదా చేతులు .. కాళ్ళు కదిలించడం ప్రారంభిస్తే, అప్పుడు ఏ తల్లిదండ్రుల హృదయం అయినా వణుకుతుంది. వారు వెంటనే పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకొని అతనికి స్వాంతన చేకూర్చానికి ప్రయత్నిస్తారు. అలాంటి పనులు చేస్తున్నప్పుడు కూడా పిల్లవాడు నిద్రపోతున్నట్లయితే, అప్పుడు తల్లిదండ్రులు అతనిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి కల వచ్చిందని, అందుకే భయపడి అలా చేస్తున్నాడని కుటుంబ సభ్యులు భావిస్తారు. నిజానికి ఆ పిల్లవాడు నిద్ర భీభత్సానికి బాధితుడు అంటే పిల్లవాడు స్లీప్ టెర్రర్ తో బాధపడుతున్నాడని అర్ధం అని నిపుణులు చెబుతున్నారు. కల రావడం లేదా మరొక ఇబ్బంది కాదని వారంటున్నారు. దీని గురించి నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకుందాం.
స్లీప్ టెర్రర్ అంటే ఏమిటి?
స్లీప్ టెర్రర్‌ను నైట్ టెర్రర్ అని కూడా అంటారు. చాలా సార్లు తల్లిదండ్రులు నైట్ టెర్రర్ .. నైట్ మేయర్‌లను ఒకటిగా భావిస్తారు, కానీ రెండూ ఒకదానికొకటి భిన్నం. నైట్ మేయర్‌లో, పిల్లలు భయానక కలలు కంటారు, నైట్ టెర్రర్‌లో, పిల్లల సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా విషయాలు జరుగుతాయి. ఈ సమయంలో పిల్లవాడు గాఢ నిద్రలో ఉన్నాడు. అందువల్ల, భయం కారణంగా పిల్లవాడు చేసే చర్యలను నియంత్రించడం చాలా కష్టం. సాధారణంగా 4 నుంచి 16 ఏళ్ల పిల్లల్లో ఇది కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు ఇది నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కూడా సంభవించవచ్చు. ఒక చిన్న పిల్లవాడు అకస్మాత్తుగా ఏడుపు లేదా నిద్రలో ఏదైనా కదలికను ప్రారంభించినట్లయితే, అతను నైట్ టెర్రర్ కు గురయ్యే అవకాశం ఉంది.
ఇవే నైట్ టెర్రర్ లక్షణాలు..
- నిద్రలో ఏడుపు, అరుపులు లేదా మీ తలపై కొట్టడం.
- ఈ సమయంలో పిల్లలు తమ చేతులు .. కాళ్ళను కదుపుతున్నప్పుడు చాలా సార్లు గొణుగుతారు.
- మూసిన కళ్లను త్వరగా పక్కనుంచి కదిలిస్తూ ఉంటాడు.
- వేగంగా శ్వాస తీసుకుంటాడు
- పిల్లవాడు చెమటతో తడిసిపోతాడు
పిల్లల్లో ఎందుకు ఈ నైట్ టెర్రర్ వస్తుంది?
- కొన్ని కారణాల వల్ల పిల్లల నిద్ర దినచర్య ప్రభావితం అయినప్పుడు.
- పిల్లవాడు ఒకరోజు బాగా అలసిపోయినప్పుడు.
- పిల్లవాడు ఏదైనా కారణంగా ఒత్తిడికి గురైనప్పుడు.
- అతనికి ఏదో ఇష్టం లేని విషయం అతని మనసులో బలంగా నాటుకుని పోయినప్పుడు ఇలా జరుగుతుంది
తల్లిదండ్రులు ఏమి చేయాలి?
- మీ బిడ్డ ఒకే సమయంలో పదే పదే కలత చెందుతుంటే, ఆ సమయానికి 10 నిమిషాల ముందు పిల్లవాడిని నిద్రలేపి, 10-15 నిమిషాలు నడవనివ్వండి.
- నిద్రపోయే సమయంలో బేబీ కలత చెందినపుడు మీరు అతనితో ఉన్నారని .. అంతా బాగానే ఉందని ఓదార్చండి.
- పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
- ముందు రాత్రి పిల్లవాడు నిద్దర్లో చేసిన పని అతనికి మర్నాడు చెప్పకండి. ఇది అతనిని కలవార పెడుతుంది.
- పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించండి, దీని కారణంగా కూడా నైట్ టెర్రర్ సమస్య వస్తుంది.
- శిశువు నిద్రించడానికి ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి.
- పిల్లలలో ఈ సమస్య నిరంతరం పెరుగుతూ ఉంటే, అప్పుడు వైద్యుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి: Deepthi Sunaina: లైవ్‌లో కన్నీళ్లు పెట్టిన దీప్తి.. హృదయం ముక్కలైన ఎమోజీలు పెట్టిన షణ్ముక్