టీ ఎక్కువగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో చాలా మందికి రోజు మొదలుపెట్టాలంటే ఒక కప్పు టీ కావాల్సిందే. ఉదయం లేవగానే లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకునేటప్పుడు టీ తాగే అలవాటు చాలా మందిలో ఉంది. వాతావరణం ఎండగా ఉన్నా, వర్షం పడుతున్నా ఈ అలవాటు మాత్రం మారదు.

కొంతమంది అయితే రోజుకు నాలుగు నుంచి ఆరు సార్లు కూడా టీ తాగుతుంటారు. చాలా సార్లు టీ తాగకపోతే పని చేయలేమన్న భావన వారిలో పెరుగుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంత వరకు మంచిదో మనం ఆలోచించాలి. విద్యార్థులు, ఉద్యోగులు, ఇంటి పనులు చేసే వాళ్ళు.. టీ తాగితే ఉత్సాహం వస్తుందని అనుకుంటారు. దాంతో కొన్ని సమయాల్లో టీ తాగడం తప్పనిసరి అవుతుంది. కానీ దీని వల్ల కలిగే చెడు ఫలితాలు మాత్రం అంత మంచివిగా ఉండవు.
పరిశోధనలు చెప్పినదాని ప్రకారం.. ఎక్కువ టీ తాగడం వల్ల మన మనసుపై ప్రభావం పడుతుంది. ప్రశాంతత కోల్పోవడం, ఆందోళనతో ఉండటం, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఈ అలవాటు ద్వారానే వస్తాయి. టీలో ఉండే కెఫిన్ మన నాడీ వ్యవస్థను ఎక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
అంతేకాదు.. టీలో ఉండే టానిన్ అనే పదార్థం మన శరీరానికి అవసరమైన ఐరన్ సరిగా అందకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల రక్తహీనత లాంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో, పిల్లలలో ఇది మరింత ప్రమాదకరం.
ఇంకా తీవ్రమైన విషయమేంటంటే.. క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ మందులపై కూడా ఎక్కువ టీ తాగడం చెడు ప్రభావం చూపుతుంది. టీ తీసుకునేటప్పుడు కొన్ని రసాయన క్రియలు జరిగి చికిత్స తక్కువగా పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇవన్నీ చూస్తే రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల టీ తాగడం మాత్రమే మనిషి శరీరానికి సరిపోయే మోతాదని నిపుణులు చెబుతున్నారు. దాన్ని మించి తాగితే శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా టీ మీద ఎక్కువ ఆధారపడటం ఒక మానసిక సమస్యగా మారి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
సరైన సమయంలో, సరైన మోతాదులో మాత్రమే టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. టీ అనేది సహజమైనదే అయినా.. దీని వాడకంలో పరిమితి లేకపోతే అది ఒక మధురమైన విషంలా మారుతుంది.
టీ తాగడం ఒక అలవాటు కావచ్చు.. కానీ అది ఒక బాధ్యతతో కూడిన అలవాటుగా ఉండాలి. ఎక్కువ టీ తాగడం వల్ల వచ్చే సమస్యలు ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉండాలంటే.. రోజుకి 1 లేదా 2 కప్పులకే పరిమితం కావడం చాలా మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




