AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సీడ్స్ తింటున్నారా..? జర జాగ్రత్త.. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!

విత్తనాలు ఎప్పుడూ శక్తినిచ్చే సహజ ఆహార పదార్థాలు. వాటిలో ముఖ్యంగా బూడిదగుమ్మడి విత్తనాల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ లాంటి ఎన్నో పోషకాలు వీటిలో నిండి ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని చెడు ప్రభావాలు వస్తాయి. అవేంటో తెలుసుకుంటే వాటిని సరైన విధంగా తీసుకోవచ్చు.

ఈ సీడ్స్ తింటున్నారా..? జర జాగ్రత్త.. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
Pumpkin Seeds Benefits
Prashanthi V
|

Updated on: Jun 16, 2025 | 11:04 PM

Share

బూడిదగుమ్మడి విత్తనాల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. తక్కువ మోతాదులో తీసుకుంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ ఎక్కువ తింటే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియా లాంటివి రావచ్చు.

ఈ విత్తనాల్లో మంచి కొవ్వులు ఉన్నా వాటిలో కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. ప్రతి రోజు ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. బరువు అదుపులో ఉంచుకోవాలంటే వీటిని తక్కువగా మాత్రమే తీసుకోవాలి. తిన్న తర్వాత వ్యాయామం చేయడం తప్పనిసరి.

కొంతమందికి విత్తనాలు, నట్‌లు లాంటి వాటికి సహజంగానే అలర్జీ ఉంటుంది. అలాంటి వారు బూడిదగుమ్మడి విత్తనాలు తీసుకున్నప్పుడు గొంతు దురద, తలనొప్పి, తుమ్ములు, దగ్గు, చర్మంపై దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి వారు తినే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

బూడిదగుమ్మడి విత్తనాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే హై బీపీ ఉన్నవారికి ఇవి మంచివి. కానీ లో బీపీ ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు మరింతగా తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వారు తీసుకునే మోతాదుపై జాగ్రత్తగా ఉండాలి.

చిన్నపిల్లల జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే ఎక్కువ పీచు పదార్థాలు వారికి కడుపు నొప్పి, అజీర్ణం లాంటి సమస్యలు కలిగించవచ్చు. అలాగే విత్తనాలు గొంతులో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటిని నేరుగా ఇవ్వకూడదు. వాటిని పొడి చేసి పాలల్లో కలిపి ఇవ్వవచ్చు.

ఈ విత్తనాలను వేయించి పొడి రూపంలో తీసుకోవడం మంచిది. రోజుకు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లలకు అర స్పూన్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు. వీటిని పెరుగు లాంటి ఆహారాల్లో కలిపి తీసుకుంటే మేలు.

బూడిదగుమ్మడి విత్తనాల్లో చాలా పోషకాలు ఉన్నా.. వాటిని ఎక్కువగా తీసుకుంటే పైన చెప్పిన లక్షణాలు వస్తాయి. పూర్తిగా మానేయడం కంటే తక్కువ మోతాదులో జాగ్రత్తగా తీసుకోవడమే మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మితంగా తినడమే ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత